నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోలో సినీ ప్రముఖులతో పాటు ఈ సీజన్ లో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. మొదటి సీజన్ లో మహేష్ బాబు నుంచి రవితేజ వరకు బాలయ్యతో రచ్చ చేయగా. ఈ సీజన్ లో కూడా యువ హీరోలు శర్వానంద్, అడివిశేష్ వంటి వారు ఈ షోలో పాల్గొని సందడి చేశారు.
రీసెంట్ గా వచ్చిన ఐదో ఎపిసోడ్‌లో టాలీవుడ్ లో ఉన్న లెజెండ్రీ ప్రొడ్యూసర్స్ మరియు దర్శకులైన రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు అతిథులుగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలను బాలయ్యతో పంచుకున్నారు. ఇప్పుడు రాబోయే ఆరో ఎపిసోడ్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను బాలయ్య షోలో దించబోతున్నారు. ఈ విషయం గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికార ప్రకటన రాకపోవడంతో కొంత అనుమానం కలిగింది. కానీ ఇప్పుడు ఆహా తాజాగా అధికారికంగా ప్రభాస్‌కు సంబంధించిన అప్డేట్ ను బయటికిి ఇచ్చింది.
దానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ… ‘పాన్ ఇండియా స్టార్ విత్ గాడ్ ఆఫ్ మాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది’. ప్రస్తుతం ఈ వీడియో బాలయ్య అభిమానులను ప్రభాస్ అభిమానులను బాగా అకట్టుకుంటుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ షోలో ప్రభాస్ తో పాటు అతని ప్రాణ స్నేహితుడైన మరో హీరో గోపీచంద్ కూడా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.