సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ యాక్టర్ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చిరు వయసు 60 ఏళ్లు. అయినప్పటికీ ఎంతో యాక్టీవ్‌గా యంగ్ హీరోలా కనిపిస్తాడు. ఇటీవలే చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ విడుదలై సూపర్ హిట్ అయింది.
ఇక చిరంజీవి మనవరాలు సంహిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూతురు సంహిత. సంహిత, తన తాత చిరంజీవి, శేఖర్ మాస్టర్‌తో కలిసి బాస్ పార్టీ సాంగ్ కి స్టెప్పులు వేసింది. ఆ సమయంలో ఫేస్ లో చాలా అద్భుతంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. అంతేకాదు, డ్యాన్స్‌లో చాలా గ్రేస్ చూపించింది. ప్రస్తుతం ఆ వీడియోని సుస్మిత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ వీడియోకి దాదాపు 17,000కు పైగా లైక్స్ వచ్చాయి. సంహిత పర్ఫామెన్స్ చూసి చిరంజీవి మనవరాలా మజాకా.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టేసిందగా.. త్వరగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసేయ్ అని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
సంహిత డ్యాన్స్‌కి ఫిదా అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు సంహిత సినిమాలోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కి బాబీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రవితేజ కూడా నటించాడు.