బాలీవుడ్లో స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం కోసం షారుక్ ఖాన్ అభిమానులు సైతం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఒక పాట దీపిక పదుకొనే అందాలు కుర్రకారులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో షారుక్ ఖాన్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. దీపికా పదుకొనే అందాల ఆరబోత చూసిన వారంతా ఒక్కసారిగా నోరెళ్ళ పెడుతున్నారు. అయితే దీపికా ఈ చిత్రంలో నటించడానికి ఎన్ని కోట్లు అందుకుందో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది వాటి గురించి తెలుసుకుందాం.
గతంలో కూడా దీపిక పదుకొనే బికినీలలో కనిపించింది కానీ ఇంత ఘాటుగా అయితే ఎన్నడూ కనిపించలేదు. ముఖ్యంగా బికినీ సైజుని ఇంకాస్త తగ్గించి ఊహించని విధంగా కనిపించింది దీనికి తోడు షారుఖ్ ఖాన్ తో ఆమె చేసిన రొమాంటిక్ స్టెప్పులు మైండ్ బ్లోయింగ్ అయ్యేలా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా పఠాన్ సినిమా రేంజ్ పెరిగిపోయింది. దీపిక పదుకొనే ఈ రేంజ్ లో చూపించడానికి అసలు కారణ రెమ్యూనరేషన్ అన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనే గత చిత్రాలకు రూ.12 కోట్ల రూపాయలు మధ్యలో తీసుకునేదట కానీ పఠాన్ సినిమా కు రూ.15 కోట్ల రూపాయలు పారితోషకం అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అందుచేతనే ఈ అమ్మడు అందుకు తగ్గట్టుగా అందాలు చూపిస్తోంది అంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే ఒక టీజర్ లుక్ కు కూడా విడుదలై మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు బెశారం పాటతో దీపికా పదుకొనే అందాలు కుర్రకారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ చిత్రం జనవరి 25న వచ్చే ఏడాది చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.