మ‌హేష్- రాజ‌మౌళి సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి.. ఎలాంటి పాత్రో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నాడు. మ‌హేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావ‌డంతో `ఎస్‌ఎస్‌ఎంబీ 29` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు.

రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా.. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించ‌బోతున్నాడ‌ట‌.

ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు తండ్రి పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌బోతున్నార‌ని.. ఇప్ప‌టికే రాజ‌మౌళి అమితాబ్ ను సంప్ర‌దించ‌గా, ఆయ‌న వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది. కాగా, అమితాబ్ అల్రెడీ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. అదే `ప్రాజెక్ట్ కె`. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో విడుదల కానుంది.