న్యూ లుక్ తో అదరగొడుతున్న మహేష్ బాబు..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు తల్లిదండ్రులను కోల్పోయారు. తన తల్లి మరణం కారణం చేత సినిమా షూటింగులు వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్లకు హాజరు కాబోతున్న సమయంలో హఠాత్తుగా తన తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు ఒక నెల రోజులపాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే చాలా గ్యాప్ ఇవ్వడంతో పలు సార్లు షూటింగ్స్ ఆగిపోయాయి.దీంతో మహేష్ బాబు తన వల్ల ఇతరులకు ఇబ్బంది కాకుండా ఉండేందుకే షూటింగుకు జాయిన్ అయ్యేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Mahesh Babu (@urstrulyMahesh) / Twitterఈ విషయాన్ని మహేష్ బాబు ఒక ఫోటోను షేర్ చేయడం ద్వారా చెప్పుకొచ్చారు. తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మౌంటెన్ డ్యూ యొక్క యాడ్ చిత్రీకరణ కోసం మహేష్ బాబు కెమెరా ముందుకు రావడం జరిగింది. కాస్త ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకున్న మహేష్ మళ్ళీ మునుపటి ఉత్సాహంతో షూటింగ్ పాల్గొనాలని అభిమానుల సైతం భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ మౌంటెన్ డ్యూ యొక్క యాడలో మహేష్ బాబు లుక్కు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేస్తోంది.

సూపర్ హెయిర్ స్టైల్ తో పాటు ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ తో ఈ ఫోటో ఉన్నట్లుగా అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. యాడ్ చిత్రీకరణ ఒకటి రెండు రోజుల గ్యాప్ లోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో మహేష్ బాబు పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ వర్క్ అంటూ విచ్చేయడంతో మహేష్ అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటించనున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించి ఈ న్యూ లుక్ ఫోటో వైరల్ గా మారుతోంది.

https://twitter.com/urstrulyMahesh/status/1599015922081366016?s=20&t=OkeYueBmk4ZRskZQg3P5wQ