ఎక్కువగా హీరోయిన్లు జబ్బుల బారిన పడడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఈ మధ్యకాలంలో వరుసగా జబ్బుల బారిన పడటం జరుగుతోంది. అందులో ముఖ్యంగా సమంత, నటి కల్పిక గణేశన్, పూనమ్ కౌర్ తదితర హీరోయిన్లు కూడా జబ్బుల బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ లకే ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటూ టాలీవుడ్ లో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా సైతం ఈ హీరోయిన్లకు వచ్చిన జబ్బుల పై పలు రకాలుగా పోస్టులు తెలియజేస్తున్నారు. అయితే వీరికి రావడానికి గల కారణాలు ఏంట..?అనే విషయంపై కొన్ని సంచలన విషయాలు బయటపడినట్లుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

After Samantha Ruth Prabhu, another actress Poonam Kaur diagnosed with the  rare disorder Fibromyalgiaహీరోయిన్స్ మాత్రమే ఇలాంటి జబ్బులు బారిన పడుతున్నారు అంటే.. హీరోయిన్ ఎక్కువగా గ్లామర్ కాపాడుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా తమ ఫిజిక్ ని కాపాడుకునేందుకు అందంతో ఆకర్షించేందుకు అందుకు తగ్గట్టుగా డైట్ వంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొత్త కొత్త డైట్లు రావడం వాటిని పాటించడం వల్ల.. శరీరం అంత చాలా వీక్ అయిపోతుందట. అందుచేతనే హీరోయిన్స్ తమకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకొని మరి కడుపు మార్చుకుంటున్నారు.

వీటివల్లే ఈ హీరోయిన్లు ఇలా జబ్బుల బారిన పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా మరికొన్నిసార్లు వైద్యులు చెప్పిన వాటికంటే లిమిట్స్ క్రాస్ చేస్తూ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఇలాంటి బారిన పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు మాత్రం సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి వింత రోగాల బారిన పడడానికి కారణం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. హీరోయిన్స్ కేవలం అందం కోసమే ఇలాంటివి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇతర హీరోయిన్స్ వీరిని చూసైనా డైట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి మరి.