టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో అనుష్క నుంచి ఎలాంటి సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం అయితే కేవలం ఒక్క సినిమాలో నటిస్తోంది అనుష్క. అవకాశాలు వస్తున్న కూడా ఎందుకో సినిమాలు విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. అనుష్క హైదరాబాద్ ని మాత్రం వదిలి వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా ఆమె భాగ్యనగరంలోనే ఉంటోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం ఏదైనా పనిమీద మాత్రమే బెంగళూరుకు వెళ్లి వస్తూ ఉంటుంది తప్ప హైదరాబాదును విడిచి వెళ్లలేదని సమాచారం.
అనుష్క సినిమాలకు కాస్త దూరంగా ఉండడంతో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల పొజిషన్లో దక్కించుకోవడానికి ఎంతో మంది హీరోయిన్లు ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రష్మిక కూడా అందులో ఉందని చెప్పవచ్చు. ఈమధ్య బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి స్థిరపడాలని ఆలోచిస్తుంది. టాలీవుడ్ లో స్టార్ పొజిషన్లో ఉన్న రష్మిక ఆ వెంటనే బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తోంది. రష్మిక ప్రస్తుతం లగ్జరీ లైఫ్ ని మాత్రం అనుష్కకు దీటుగా ఆస్వాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా రష్మిక ఇద్దరు కూడా ఒకే అపార్ట్మెంట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇద్దరు ఫోష్ సో సైటి లో ఖరీదైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిటీలోనే అత్యధిక ఖరీదైన జయభేరి దీ పిక్ లో నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. ఇద్దరు కూడా ఒకే బ్లాకులో డిఫరెంట్ ఫ్లోర్లలో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది సొంత ఇల్లు ఉన్నప్పటికీ ఇందులో అదే చెల్లించి మరి ఉంటున్నట్లుగా సమాచారం. ఈ ఇద్దరు ముద్దుగుమ్మరు ఒకే చోట ఉండడం గమనార్హం.