ఎన్టీఆర్ సినిమాతో కళ్యాణ్ రామ్..మరోసారి హిట్ అందుకోబోతున్నాడా..!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోలలో ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరో హీరో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఇటు సినిమాల్లో హీరోగా ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలు పరంగా చూసుకుంటే ఆయన ప్రతి సినిమా కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఎప్పుడు కొత్తదనం కోరుకునే కళ్యాణ్ రామ్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

ఈ క్రమం లోనే కళ్యాణ్ రామ్ పటాస్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో హిట్ అందుకోవడానికి కొన్ని సంవత్సరాల టైం పట్టింది. రీసెంట్‌గా వచ్చిన ‘బింబిసార’ సినిమాతో పటాస్ తరహా హిట్‌ అందుకున్నాడు.ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ లాంటి సూపర్ హిట్ తర్వాత ‘అమిగోస్‌’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాపై పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకపోయినా.. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Amigos Trailer Nandamuri Kalyan Ram | RajendraReddy | AshikaRanganath |  Ghibran | Mythri Movie - YouTube

కళ్యాణ్ రామ్ – రాజేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు అమీగోస్ అనే టైటిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. నిజానికి ఈ సినిమాను ముందుగా ఈ డిసెంబర్ లోనే ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా విడుదల తేదీ ఆలస్యం అయ్యిందంటూ సినిమా యూనిట్ తెలిపింది.

Kalyan Ram Amigos: కళ్యాణ్ రామ్ 'AMIGOS'.. మరో వైవిధ్యమైన చిత్రంతో వస్తోన్న  నందమూరి హీరో

అమీగోస్ అంటే మూడు చేతులు కలవాడు అని అర్థం. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టు ఈ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా కథకి దగ్గర పోలికలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కూడా జై లవకుశ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు.

ఇప్పుడు వచ్చే ‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా మూడువిభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంటే జై లవకుశ సినిమాల్లో లాగా ముగ్గురు ఎన్టీఆర్‌లు ఉంటే.. ఇందులో ఇద్దరవి పాజిటివ్ పాత్రలు.. ఒకరిది నెగటివ్ పాత్ర. ఇప్పుడు కూడా అమిగోస్ సినిమాలో కూడా అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఓ పాత్రలో విలన్ గా కనిపిస్తాడట. ఈ సినిమా కథ కూడా ఒకేలా ఉండే ముగ్గురు వ్యక్తులు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.

వారు ఎలా ? కలిశారు.. కలిశాక వారి జీవితాల్లో ఏం జరిగింది.. అనే ఆసక్తికరమైన స్టోరీ తో ఈ సినిమా ప్రేక్షకు ముందుకు రాబోతుంది. ప్రధానంగా ఈ సినిమా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కాలానికి అనుకూలంగా ఓ యాప్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇలాంటి పాయింట్ తో సినిమా ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏదిరాలేదు. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ త‌న ఖాతాలో వేసుకోబోతున్నాడని తెలుస్తుంది.