కాజల్ లేటెస్ట్ పిక్స్ చూస్తే మీకు పిచ్చెక్కిపోవడం గ్యారంటీ!

టాలీవుడ్ అందాల భామ కాజల్ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తేజ దర్శకత్వంలో ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అనతికాలంలోనే సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలో చిన్న హీరోలను మొదలుకొని పెద్ద పెద్ద హీరోల సరసన నటించి మెప్పించారు.

ఇకపోతే ఆ తరువాత కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని సెటిలై పోయిన సంగతి కూడా తెలిసినదే. ఈ క్రమంలో వీరు ఓ పండంటి బిడ్డకు కూడా జన్మను ఇచ్చారు. కాగా ఈమధ్య కాలంలో కాజల్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా కనిపిస్తున్నారు. బిడ్డ కూడా పుట్టేయడంతో కాజల్ మరలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు నిర్మాతలను వూరించడానికి రకరకాలుగా ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

సదరు పిక్స్ చూసి నెటిజన్లు వారెవ్వా అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. చందమామ అందం ఎప్పటికీ తరగనిది అని కితాబిస్తున్నారు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు కొనసాగించడం కొసమెరుపు. ఏదిఏమైనా పెళ్లైన తరువాత కూడా అమ్మడు ఇలా ఫిగర్ ని మెంటైన్ చేయడం పట్ల కొందరు కుళ్ళుకుంటున్నారు. ఇక ఆమె అభిమానులు కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి, కాజల్ తెలుగులో మరలా ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తుందో?