సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో.. ఏ వార్త అబద్దమో కనిపెట్టడానికి చాలా కష్టమైపోతుంది . స్టార్ సెలబ్రిటీలు సైతం అలాంటి ఫేక్ వార్తలను నమ్మి మోసపోతున్నారు. కాగా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్ అయితే బాగుండు అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మనకు తెలిసిందే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తల్లి కాబోతుంది . ఇదే విషయాన్ని రెండు రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . గత పదేళ్ళుగా మెగా వారసుడు ఎప్పుడు వస్తాడు అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన మెగా అభిమానులకు అది నిజంగా పండగ లాంటి వార్తని అనిపించింది .
అంతేకాదు సొంత వదిన ప్రెగ్నెంట్ అయినంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు . ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఉపాసనకు విష్ చేశారు . రామ్ చరణ్ తండ్రి అవుతున్నందుకు చాలా హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు . కాగా ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుందన్నమాట వాస్తవమే కానీ ..మెగా వారసుడు ఆమె కడుపులో పెరగడం లేదు అంటూ ఓ న్యూస్ మెగా అభిమానులను కలవర పెడుతుంది. ప్రజెంట్ స్టార్ హీరో హీరోయిన్స్ అందరూ చూస్ చేసుకునే సరోగసి ప్రాసెస్ ద్వారానే ఉపాసన తల్లి కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇండియాలో సరోగసి ప్రాసెస్ బ్యాన్ చేశారు . దానికి చట్టబద్ధమైన పేపర్స్ కావాలి .
ఈ క్రమంలోనే ఉపాసన హెల్త్ ఇష్యూ బయటపడింది .ఆమెకి గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని ..పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉందని ..ఈ క్రమంలోనే ఆమె హెల్త్ దృష్ట్యా ఇలాంటి సరోగసి ప్రాసెస్ కు డాక్టర్స్ సజెస్ట్ చేశారని ..ఆ కాగితాల ఆధారంగానే ఉపాసన సరోగసి ప్రాసెస్ కి ఓకే చెప్పిందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఈ వార్తలు ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది . ఏది ఏమైనా సరే ఇదంతా ఫేక్ వార్తలని మెగాస్టార్ చిరంజీవి నోరు తెరిచి చెప్తే బాగుంటుందని మెగా ఫాన్స్ ఆశపడుతున్నారు . అంతేకాదు మెగా కోడలు ఉపాసన సైతం తన ప్రెగ్నెన్సీ పై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వాళ్లకి ఘాటుగా కౌంటర్ ఇస్తే బాగుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.