చెన్నైలో హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రతేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. విజయ్ చేసిన సినిమాలు దాదాపు అన్నీ బాక్షాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దాంతో విజయ్ అక్కడ రజని తరువాత రాజనిగా అవతరించాడు. ముఖ్యంగా మాస్ సర్కిల్లో అతగాడికి మంచి ఫాలోయింగ్ వుంది. సుమారుగా తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో అంతే మాదిరిగా విజయ్ ని అక్కడ తమిళ సినిమా ప్రేక్షకులు ఆరాధిస్తారు. ఇకపోతే విజయ్ ఈమధ్య పలు దఫాలుగా అభిమాన సంఘాలతో పలు అమాశాలపైన చర్చిస్తున్న వార్తలను మీరు చూసే వుంటారు.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ తెలుగు దర్శకుడు వంశీపైడి పల్లి డైరెక్షన్లో మరియు తెలుగు బడా నిర్మాత దిల్ రాజు సమర్పణలో ‘వారసుడు’ అనే మూవీ చేస్తున్న సంగతి విదితమే. తమిళ నాట ‘వారిసు’ అనే టైటిల్ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలో వారిసు రిలీజ్ పై ఓ సందిగ్దత నెలకొంది. సంక్రాంతి కానుకగా వారీసు సినిమాను రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. కరెక్ట్ గా అదే టైమ్ కు తమిళనాటు ఇంతే స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అజిత్ ‘తునివు’ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ ఇద్దరు స్టార్ల సినిమాల మధ్య పోటీ అంటే.. అది ఫ్యాన్ వార్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఈక్రమంలో మరోసారి పొంగల్ వార్ లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు నిలవడంతో.. కోలీవుడ్ సర్కిల్ లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయింది. కాగా వారిసు రిలీజ్ పై రకరకాల వివాదాలు నెలకొన్న నేపథ్యంలో.. మంగళవారం చెన్నైలో కొన్ని అభిమాన సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు విజయ్. ఈ నేపథ్యంలో పొంగల్ బరిలో సినిమా రిలీజ్ అయితే.. వివాదాలు, గొడవలు లేకుండా రిలీజ్ ప్రశాంతంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి 3 జిల్లాల అభిమానులు రాగా.. ఆమధ్య మరో మూడు జిల్లాల అభిమానులతో ఆయన సమావేశం జరిగినట్టు భోగట్టా.