కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆర్య-సాయేషా సైగల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `గజినీకాంత్` సినిమా సమయంలో ఆర్య, సాయేషా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు 18 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ.. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు.
గత ఏడాది ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని హీరో విశాల్ స్వయంగా వెల్లడించారు. ఆర్య సాయేషాల గారాల పట్టి పేరు ఆర్యానా. అయితే ఇప్పటివరకు కూతురు ఫోటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడ్డ ఈ దంపతులు.. తాజాగా ఆర్యానాతో దిగిన పిక్స్ ను తొలిసారి అందరితోనూ పంచుకున్నారు.
సాయేషా తన ఇన్‌స్టాగ్రామ్ లో భర్త ఆర్య మరియు కూతురు ఆర్యానాతో దిగిన ఓ అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ పిక్ ను చూసిన నెటిజన్లు `మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్` అంటూ ఆర్యానా ఉద్ధేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆర్యానా చాలా అందంగా మరియు ముద్దుగా కనిపిస్తోంది.