సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన తప్పు చేసిననా.. తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లే చిత్రీకరించే బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది . మంచి చేసిన సరే అందులో మాయ ఏదో ఉంది అంటూ వెతికే మెంటల్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటుంది అంటూ పవన్ ఫ్యాన్స్ ఫేస్ మీదే చెప్పుకొస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలోకి వచ్చాక పవన్ ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి పనికిరాని పనిలేని వాళ్లు పవన్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు .
కాగా ఇదే క్రమంలో సోషల్ మీడియాలో లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మనకు తెలిసిందే ఓ పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెట్టారు. అంతేకాదు చాలా ఏళ్లుగా దూరమైన మార్షల్ ఆర్ట్స్ కు పవన్ మళ్లీ ఈ సినిమా ద్వారా దగ్గర అయ్యి ప్రాక్టీస్ ను ప్రారంభించారు. ఇటీవల దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు.
అయితే పనిలేని ఓ బ్యాచ్ పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అతని ఫోటో ని ట్రోల్ చేస్తున్నారు. గతంలో మంచు లక్ష్మి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ దిగిన ఫోటోకి పవన్ కళ్యాణ్ రీసెంట్ ఫోటోని యాడ్ చేస్తూ “ఆఖరికి నువ్వు మంచు లక్ష్మిని కూడా కాపీ కొట్టేసావా”అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మండిపోయి అలాంటి వాళ్లకి ఘాటు గా కౌంటర్లు ఇస్తున్నారు. ” అప్పటికి ఇప్పటికీ నీలో ఏం మార్పు రాలేదు. నువ్వు ఎవర్గ్రీన్ ..వింటేజ్ లుక్ అద్దిఐంది బాసూ” అంటూ పవన్ ఫ్యాన్స్ ఆయన ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు.
ప్రజెంట్ట్ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ VS పవన్ యాంటీ ఫ్యాన్స్ మధ్య రచ్చ పీక్స్ లో ఉంది. కాగా ఇదే క్రమంలో గతంలో ఆయన అధికారిక పార్టీ ని విమర్శించిన తీరు కి సంబంధించిన వీడియో సైతం ట్రోల్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కొందరు రాజకీయ నేతలను “నా కొడకల్లారా.. చెప్పుతో కొట్టాలి “అంటూ హద్దులు మీరి మాట్లాడిన మాటలు తెలిసిందే. ఇలాంటి టైం లోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి నెగటివ్ ని బయటకు తీసుకురావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే పవన్ ని విమర్శించే వాళ్ళు ఎక్కువ అయ్యారు అంటే ఆయన రాజకీయంగా ముందుకు వెళ్తున్నారని అర్థం అంటూ పవన్ ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.