వాల్తేరు వీరయ్య చిత్రం రవితేజదా ..చిరంజీవిదా..?

మాస్ హీరో రవితేజ, చిరంజీవి కలిసి వాల్తేర్ వీరయ్య చిత్రంలో నటిస్తున్నారు. దాదాపుగా వీరిద్దరూ కలసి 22 ఏళ్ల క్రితం అన్నయ్య చిత్రంలో మాత్రమే నటించారు. ఈ చిత్రం 2000 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలై మంచి బ్లాక్ బ్లాస్ట్ భాస్కర్ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు అప్డేట్లు విడుదల కాగా ఈ చిత్రానికి బాగానే హైప్ పెరుగుతోంది.

Mass Maharaja Ravi Teja Joins Megastar Chiranjeevi & Bobby's 'Mega154' sets  | Telugu Movie News - Times of India

చిరంజీవి ఈ చిత్రంలో మాస్ పాత్రలో చాలా యంగ్ గా కనిపించబోతున్నారు. ముఖ్యంగా చూస్తే చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమాలో ని లుక్ గుర్తుకొస్తుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి తల్లి సోదరులుగా కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా విక్రమ్ సాగర్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ క్యారెక్టర్ కు సంబంధించి విడుదల చేసిన ఒక టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ప్రస్తుతం రవితేజ నిడివి ఎంత ఉంది అనే విషయం తెలిసిన తర్వాత అభిమానులు ఈ చిత్రం రవితేజదా ..చిరంజీవిదా అని అనుమానం నెలకొంటుంది.

Ravi Teja To Lead An Actioner With Chiranjeevi & Fans Already Can't Keep  Calm!రవితేజ క్యారెక్టర్ని నిడివి ఇందులో దాదాపుగా 44 నిమిషాల పాటు ఉంటుందట. ఫుల్ సీన్స్ లో మాత్రమే రవితేజ కనిపిస్తారని చిరు, రవితేజ కాంబినేషన్ లా ఉంటుందని సమాచారం. దాదాపుగా రవితేజ క్యారెక్టర్ ఇందులో గంట సేపు ఉంటుందని దీంతో అభిమానులు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎవరికి బాగా హైప్ వస్తుందో చూడాలి మరి.