బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `హిట్ 2`.. తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌద‌రి జంట‌గా న‌టించిన చిత్రం `హిట్ 2`. విశ్వ‌క్ సేన్ న‌టించిన విజ‌వంత‌మైన చిత్రం `హిట్‌`కు సీక్వెల్ ఇది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కు శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. `హిట్‌`కు సీక్వెల్ కావ‌డం, టీజ‌ర్ ట్రైల‌ర్ తో మేక‌ర్స్ పెంచిన అంనాలు, అడివి శేష్‌కు ఉన్న క్రేజ్ కు తోడు టాక్ కూడా అనుకూలంగా ఉండ‌టంతో.. `హిట్ 2` బాక్సీఫీస్‌ను ఓ రేంజ్ లో షేక్ చేసింది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 4.03 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.6.43 కోట్ల షేర్‌తో దుమ్ము దులిపేసింది. ఇక ఏరియాల వారీగా హిట్ 2 టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.92 కోట్లు
సీడెడ్: 38 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 53 ల‌క్ష‌లు
తూర్పు: 29 ల‌క్ష‌లు
పశ్చిమ: 19 ల‌క్ష‌లు
గుంటూరు: 33 ల‌క్ష‌లు
కృష్ణ: 24 ల‌క్ష‌లు
నెల్లూరు: 15 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 4.03కోట్లు(6.90కోట్లు~ గ్రాస్‌)
———————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.45 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.95 కోట్లు
————————————
వైర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 6.43కోట్లు(11.75కోట్లు~ గ్రాస్‌)
————————————

కాగా, ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. ఈ మార్క్ ని అందుకోవాలి అంటే మొద‌టి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ.8.57 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది.

Share post:

Latest