సంగీత్ లో కాబోయే భ‌ర్త‌తో హ‌న్సిక అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

ప్ర‌ముఖ హీరోయిన్ హ‌న్సిక మ‌రి కొన్ని గంట‌ల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్ట‌బోతోంది. ముంబైలో స్థిరప‌డ్డ వ్యాపార‌వేత్త సోహైల్‌ కథూరియాతో నేడు తాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్ లో హ‌న్సిక వివాహం జ‌ర‌గ‌బోతోంది.

కుటుంబ స‌భ్యుల‌తో పాటు అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే వీరి పెళ్లికి హాజ‌రు కానున్నారు. ముండోటా కోటలో శుక్ర‌వారం రాత్రి మెహందీ వేడుక‌ను నిర్వ‌హించారు.

శ‌నివారం నాడు సంగీత్ ఫంక్ష‌న్ చేశారు. ఈ వేడ‌క‌లో హ‌న్సిక‌, సోహైల్‌ కథూరియా అందంగా మెరిసిపోతూ క‌నిపించారు. అంతేకాదు, కాబోయే భ‌ర్త‌తో హ‌న్సిక అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడులు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా, దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్, హిందీలో ఇప్పటికే యాబైకి పైగా సినిమాలు చేసిన హ‌న్సిక‌.. పెళ్లి త‌ర్వాత కూడా త‌న కెరీర్ ను కొన‌సాగిస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

https://twitter.com/HydTimes/status/1599039023548608512?s=20&t=Rl9p8FS1iVOiQVHt5tLPDw