బాలీవుడ్ ముద్దుగుమ్మ ఫ్లోరా షైనీ అంటే చాలామందికి తెలియక పోవచ్చు కానీ.. లక్స్ పాప పాప పాట చూస్తే ఈ ముద్దుగుమ్మని టక్కున గుర్తుపట్టొచ్చు ఓ ఆశా షైనీనా. బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమాలో బాలయ్య తో పాటు లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తావా అంటూ స్టెప్పులేసి ఇండస్ట్రీని షేక్ చేసింది ఆశా. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన తర్వాత ఫ్లోరా షైనీగా పేరు మార్చుకుని వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మీడియాతో పంచుకుంది. తన ప్రియుడు నిర్మాత అయిన గౌరవ్ దోషి తనని ఎలా హింసించాడో చెప్పుకొచ్చింది. అతని కోసం కన్నవాళ్ళను కూడా వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాను.. ఇప్పుడు అతని నిజస్వరూపం తెలిసి భయపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
తన ప్రియుడు గురించి మాట్లాడుతూ..’గౌరవ్ మొదట్లో నన్ను చాలా బాగా చూసుకున్నాడు.. మా అమ్మ నాన్నలు కూడా అతని చూసి ఎంతో ఆనందించారు’. ‘వారు వద్దన్నా అతనితో వెళ్లిపోయా.. కొన్ని రోజులు అంతా బాగా ఉంది. ఆ తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది’. ‘ఆ తర్వాత నుండి నన్ను శారీరకంగా మానసికంగా హింసించేవాడు. శ్రద్ధ వాకర్ లాగా నేను కూడా చచ్చిపోతానని అనుకున్నా.. నేను ఇల్లు వదిలి వచ్చిన వారం రోజుల్లోనే అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను’.
‘ఓ రోజున దవడ పగిలిపోయేలాగా నన్ను హింసించాడు. మరోసటి రోజు నన్ను చంపేస్తానని అరుచుకుంటూ వచ్చాడు.. అప్పుడు మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పారిపోవటం మాత్రమే శరణ్యం.. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా గుర్తించకుండా ఇంటి నుంచి పరిగెత్తాను.. అతని దగ్గర నుంచి బయటికి వచ్చేసాక మళ్లీ అతని వైపు కన్నెత్తి చూడలేదని’ ఆమె చెప్పుకొచ్చింది.