జేడీ విశాఖ నుంచే..టీడీపీతోనా? జనసేనతోనా?

సి‌బి‌ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ మేరకు ప్రణాళికలు కూడా రచించుకుంటున్నారు. చాలా రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కీలకంగా ఉంటున్నారు. కార్మికులకు మద్ధతుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ విశాఖ ఎంపీగానే పోటీ చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే జేడీ..జనసేనలోకి వచ్చి..ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

కానీ ఓట్లు మాత్రం బాగానే తెచ్చుకున్నారు..ఇలా జనసేన తరుపున పోటీ చేసి ఓట్లు చీలడంతో టీడీపీ నుంచి పోటీ చేసిన భరత్ కేవలం 4 వేల ఓట్ల తేడాతో వైసీపీ చేతులో ఓడిపోయారు. అయితే అలా జనసేన తరుపున బరిలో దిగి ఓడిపోయిన తర్వాత ఆయన..జనసేనకు రాజీనామా చేసేశారు. పవన్ మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అవ్వడంతో..జేడీ జనసేన నుంచి బయటకొచ్చారు. ఇక అప్పటినుంచి సొంతంగా ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ముందుకెళుతున్నారు.

అలాగే కొంతకాలం నుంచి లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణతో కలిసి పనిచేస్తున్నారు. అయితే వీరు కలిసి ముందుకెళ్తారని ప్రచారం జరిగింది..కానీ వారికి ప్రజా మద్ధతు అంతగా రాకపోవచ్చు అని అర్ధమైపోతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు..కానీ ఇండిపెండెంట్ గా సత్తా చాటడం జరిగే పని కాదు. అందుకే జేడీ మళ్ళీ జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.  కానీ జనసేనలో పోటీ చేసిన గెలుపు ఈజీ కాదు.

అందుకే ఆయన టీడీపీ ఇచ్చే ఆఫర్లని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. టీడీపీ సైతం జేడీని ఆహ్వానించినట్లు తెలిసింది. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటేనే జేడీ ముందుకెళ్లడానికి రెడీ అవుతున్నారట. టీడీపీ-జనసేన పొత్తు ఉండి..విశాఖ ఎంపీ సీటు ఇస్తే పోటీ చేయడానికి రెడీ అని చెబుతున్నారని తెలిసింది. అయితే అంత తేలికగా విశాఖ ఎంపీ సీటు టీడీపీ వదులుకోవడం జరిగే పని కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లోనే బాలయ్య చిన్నల్లుడు తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ టీడీపీకి పాజిటివ్ ఉంది. కాబట్టి ఆ సీటు వదలడం కష్టం. మరి జేడీ ఎటు వెళ్తారో చూడాలి.