రానా ఆ కారణంగానే సినిమాలు చేయడం లేదా.. అదే రీజన్‌..!?

రానా దగ్గుబాటికి ఏమైంది..? కొన్ని నెలలుగా సినిమాలు ఎందుకు చేయడం లేదు.. ? కేవలం హెల్త్ ఇష్యూస్ కారణమా..? ఇంకేమైనా ఇతర కారణం ఏమైనా ఉందా..? రీసెంట్‌గా రానా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత మరో సినిమాకు కమిట్ అవలేదు రానా..? ఆయన సినిమాలు చేయకండ ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. లీడర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా తన కెరియర్ మొదలుపెట్టిన రానా.. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేసుకుంటూ హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీగా అయ్యారు.

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న రానా.. ఆ సినిమాలు కన్నా ముందే బాలీవుడ్ లో అడుగు పెట్టారు రానా. కానీ ఈ మధ్య కాలంలో రానా సినిమాలలో మునుపటి జోష్ కనిపించడం లేదు.
బాహుబలి తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమా వరకు రానా ఫుల్ ఫామ్ లో దూసుకుపోయాడు. ఆ తర్వాత కొత్త సినిమాలు విషయంలో వెనకడుగు వేసిన.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు గా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు రానా.

నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత నుండి రానా హీరోగా నటించిన సినిమా లేదు. బాలీవుడ్ లో వచ్చిన హౌస్ ఫుల్ 4 లో ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించాడు.. అరణ్య, 1945 సినిమాలు వాయిదా పడుతూ వచ్చి విడుదలై రానాకి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. రానా ఈ మధ్యకాలంలో నటించిన సినిమా భీమ్లా నాయక్ మాత్రమే.. ఆ సినిమా తర్వాత అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు రానా. అప్పటినుంచి సినిమాల సంఖ్య తగ్గించుకుంటూ వచ్చాడు. విరాటపర్వం సినిమా తర్వాత తన కొత్త సినిమా ఏది ప్రకటించలేదు. ఇక గత రెండు సంవత్సరాలుగా సినిమా కథలు వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు రానా. ప్రస్తుతం రానా తన బాబాయ్ వెంకటేష్ తో రానా నాయుడు వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు. మళ్లీ రానా మునుపటి లాగా సినిమాలతో ఎప్పుడు బిజీ అవుతాడో చూడాలి.