బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిత్తు చిత్తు.. 5 రోజుల్లో `ధ‌మాకా`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది.

దీంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌మాకా దంచి కొడుతూ దుమ్ము లేపే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి రూ. 15 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. వ‌ర్కింగ్ డేస్‌లోనూ అద‌ర‌గొట్టేస్తోంది. ఇక విడుద‌లైన ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిత్తు చిత్తు చేసి లాభాల బాట ప‌ట్టింది. 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.06 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.2.64 కోట్లు రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా ధ‌మాకా ఐదు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 8.56 కోట్లు
సీడెడ్: 3.21 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.28 కోట్లు
తూర్పు: 98 ల‌క్ష‌లు
పశ్చిమ: 77 ల‌క్ష‌లు
గుంటూరు: 1.15 కోట్లు
కృష్ణ: 1.05 కోట్లు
నెల్లూరు: 56 ల‌క్ష‌లు
———————————————-
ఏపీ+తెలంగాణ‌= 18.56 కోట్లు(33.60 కోట్లు~ గ్రాస్)
———————————————-

క‌ర్ణాట‌క+రెస్టాఫ్ ఇండియా : 1.65 కోట్లు
ఓవ‌ర్సీస్ : 1.35 కోట్లు
—————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 21.56 కోట్లు(40.50 కోట్లు~ గ్రాస్)
—————————————–

కాగా, రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హీట్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ మూవీ రూ. 2.56 కోట్ల లాభాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ స్ట‌డీగా దూసుకుపోతోంది.