అందుకే మోహన్ బాబు కాలర్ పట్టుకున్న.. మురళీమోహన్..!!

టాలీవుడ్ లో నటుడు మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎవరైనా షూటింగ్ సమయాలలో లేటుగా వచ్చినా కూడా ఒప్పుకునే వారు కాదని అప్పట్లో వార్తలు వినిపించాయి. చాలామంది మోహన్ బాబు ని చూసి భయపడుతూ ఉంటారనే విషయాన్ని కూడా ఎంతోమంది తెలియజేశారు. ఇక ఈ మధ్యకాలంలో కూడా ప్రెస్మీట్లో ఏదైనా సినిమా ఫంక్షన్లో తన సహనటుల పైన చేసే కామెంట్లు కూడా ఎప్పుడు వివాదంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటుడు మురళీమోహన్ మోహన్ బాబు గురించి కొన్ని విషయాలు తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

End Of Murali Mohan's Political Careerఒకానొక సమయంలో మోహన్ బాబు తన కాలర్ పట్టుకున్నాడు అంటూ బాంబు పేల్చారు మురళీమోహన్.. మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగిందట. ఆ సమయంలో సినిమా ఆర్టిస్టులతో క్రికెట్ ఆడించి కలెక్షన్స్ చేయాలని భావించారట. అప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న బాలకృష్ణ, చిరు, నాగార్జున, వెంకటేష్ కెప్టెన్లుగా ఉన్నారని తెలిపారు. ఆ సమయంలో మోహన్ బాబు తన కొడుకు కూడా విష్ణు క్రికెట్ ఆడతాడని ఏదో ఒక టీంలో ఆడించమని అడిగారట..

Tollywood Cricket | CCL | World Cup Celebrities | Ram Charan Cricket |  Rakul Preet Cricket | India Vs Bangaldesh | Lakshmi Cricket | Akhil  Akkineni Cricket | Telugu Cricket | Celebs

అప్పటివరకు ఏ ఒక్క సినిమాలో కూడా నటించని విష్ణుకి క్రికెట్ టీం లో ఆడించే అవకాశం లేదని రూల్ అందరికీ ఒకేలాగా ఉంటుందని మురళీమోహన్ మోహన్ బాబుతో డైరెక్ట్ గా చెప్పారట. దాంతో తన మాటకి ఎదురు చెబుతావా అంటూ కోపంగా మురళీమోహన్ కాలర్ పట్టుకున్నాడట మోహన్ బాబు.ఆ వెంటనే మురళీమోహన్ కూడా మోహన్ బాబు కాలర్ పట్టుకున్నారట. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మూడు రోజులకు మోహన్ బాబు వచ్చి తనదే తప్పని క్షమించమని కోరాడట దీంతో ఈ విషయం సర్దు మునిగింది అని తెలిపారు. దీంతో మంచు విష్ణు ను విష్ణు అనే పేరుతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారట.