తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే అన్ లక్కీగర్ల్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే నాగచైతన్య తో తీసిన ఒక లైలా కోసం ఈ సినిమాతో బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత ముకుందా సినిమాతో వరుణ్ తేజ్ సరసన నటించింది. కానీ ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అలా తన కెరీర్ మొదట్లోనే అన్ని ఫ్లాప్‌లు కావటంతో ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. అల్లు అర్జున్ తో నటించినా డీజే,అలా వైకుంఠపురం సినిమాలో నటించింది.ఈ సినిమాలు చేయటం వల్ల పూజా హెగ్డే కి మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే ఇక్కడి వరకు ఆమెకు అన్ని మైనస్ పాయింట్ లే ఆ తరువాత వచ్చిన రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ తో పాపులర్ అయ్యింది.
ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాతోపాటు.. మహర్షి సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ అమ్మడు. ఇలా వరుస హిట్లు సొంతం చేసుకోవడంతో ఆమె మళ్లీ గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకుంది. ఇక అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా లో నటించి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక 2022వ సంవత్సరం ప్రారంభం అవ్వడంతోనే ఆమె భారీ ప్లాపులను చవిచూసింది.. రాదేశ్యామ్ ఈ సినిమా ప్రభాస్ సరసన నటించింది. కానీ అది పెద్దగా హిట్ ను సాధించలేదు. ఆ తరువాత తమిళ స్టార్ తో బీస్ట్ సినిమాతో అతిపెద్ద పరాజయం ఎదురయ్యింది పూజా హెగ్డే కి. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ఫ్లోపే.. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి రన్వీర్ సింగ్ తో సర్కస్ సినిమా అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది. బాలీవుడ్ లో అలాంటి పరిస్థితే ఏర్పడింది. దీంతో ఈమెతో సినిమా చేయాలంటే నిర్మాతలు దర్శకులు సైతం భయపడుతున్నారు. మరి వచ్చే ఏడాదైనా ఈ ఫ్లాప్ లో నుంచి బయటపడుతుందేమో చూడాలి మరి.