పాడేరులో వైసీపీకి నెగిటివ్..టీడీపీకి నో పాజిటివ్?  

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం బలం లేని విషయం తెలిసిందే. అరకు, పాడేరు లాంటి స్థానాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా ఆ నియోజకవర్గాల్లో నడుస్తోంది. ఇక ఇందులో పాడేరు గురించి మాట్లాడుకుంటే..1985, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పాడేరు నుంచి వైసీపీ గెలుస్తూ వస్తుంది.

2014లో వైసీపీ నుంచి గిడ్డి ఈశ్వరి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె టీడీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గిడ్డి ఈశ్వరి, వైసీపీ నుంచి కోటగుళ్లి భాగ్యలక్ష్మీ విజయం సాధించారు. దాదాపు 42 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారంటే..ఇక్కడ వైసీపీ బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా వైసీపీకి పట్టున్న ఆ పాడేరులో ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు పెద్దగా పాజిటివ్ గా లేదు. ఆమె పై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. అభివృద్ధిగా దూరంగా ఉండే పాడేరుని అభివృద్ధి పథంలో నడిపించడంలో విఫలమయ్యారు. ఇక్కడ పలు అక్రమాలు కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇవన్నీ వైసీపీ ఎమ్మెల్యేకు పెద్ద మైనస్. సరే వైసీపీ ఎమ్మెల్యేకు ప్లస్ లేదు కదా..మరి టీడీపీ నాయకురాలు ఈశ్వరికి ఏమైనా ప్లస్ ఉందా? అంటే అది లేదు. ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో విఫలమయ్యారు. పెద్దగా ప్రజల్లో తిరగడం లేదు. టీడీపీని బలోపేతం చేయలేకపోయారు. దీంతో టీడీపీ పికప్ అవ్వలేదు.

అంటే పాడేరులో దొందూదొందే అన్నట్లు పరిస్తితి ఉంది. కాకపోతే ఇక్కడ వైసీపీ క్యాడర్ ఎక్కువ బలంగా ఉంది కాబట్టి..వైసీపీ నుంచి ఎవరు నిలబడిన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.