లెద‌ర్ డ్రెస్‌లో సెగ‌లు పుట్టించిన కేతిక‌.. ఈ ఆటంబాంబ్ ను కాస్త ప‌ట్టించుకోండ‌య్యా సామి!

కేతిక శర్మ.. ఈ హార్ట్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందం, అంతకుమించి టాలెంట్ ఉన్న ఆఫర్లు లేని హీరోయిన్ల జాబితాలో కేతిక ఒకటి.

`రొమాంటిక్` మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మ‌డు.. తొలి సినిమాతోనే గ్లామర్ షో ద్వారా యూత్ కు దగ్గర అయింది. ఆ తర్వాత లక్ష్య‌ మూవీలో మెరిసిన కేతిక‌.. ఇటీవల `రంగ రంగ వైభవంగా` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన‌ స్థాయిలో విజయం సాధించలేదు. వ‌రుస ఫ్లాపుల కార‌ణంగా కేతికకు ఆఫర్లు కరువ‌య్యాయి. ఈ నేపథ్యంలోనే కేతిక సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు తెర‌లిపింది.

చిట్టి పుట్టి దుస్తుల్లో గ్లామర్ షో చేస్తూ నెట్టింట‌ దుమారం రేపుతుంది. తాజాగా బ్లాక్ కలర్ లెదర్ డ్రెస్ లో ఆటం బాంబ్‌లా దర్శనమిచ్చి సెగలు రేపింది. ఓవైపు స్క్రీన్ సో చేస్తూనే.. మరోవైపు మత్తెక్కించే కళ్ళతో మైండ్ బ్లాక్ చేసింది.

కేతిక తాజా ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజ‌న్లు కేతిక అందాల‌పై క‌విత‌లు అల్లేస్తున్నారు. కొంద‌రైతే `కాస్త ఈ ఆటంబాంబ్ ను ప‌ట్టించుకోండ‌య్యా సామి` అంటూ టాలీవుడ్ దర్శకనిర్మాత‌ల‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు.