వెకేషన్ స్పెషల్.. శ్రియా శరన్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రియా శరన్. తన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు రెండు తరాల యంగ్ హీరోలతో జత కట్టిన శ్రియా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సినియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఇక ఆ తరువాత మలయాళ రీమేక్ సినిమా దృశ్యం-2లో యాక్ట్ చేసింది. నవంబర్ 18న వరల్డ్ వైడ్‌గా రిలీజై మంచి విజయాన్ని అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు సమాచారం.

శ్రియ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కెరీర్ ముగుస్తుందనే సమయంలో తన రష్యాన్ ప్రేముకుడు ఆండ్రూని 2018లో వివాహం చేసుకుంది. ఈ బ్యూటీ తన పెళ్లి విషయం గురించి మీడియాకి కూడా సమాచారం ఇవ్వలేదు. సింపుల్‌గా జరిగిన వారి పెళ్లికి కొంతమంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి ఎంత సీక్రెట్ గా జరిగిందో పిల్లల్ని కూడా అంతే సీక్రెట్ గా కన్నది శ్రీయ. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.

తను తల్లి అయిన విషయం గురించి చాలా రోజుల తరువాత అభిమానులతో షేర్ చేసుకుంది ఈ అమ్మడు. ఇక శ్రియా తన పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే పెళ్లి తరువాత కూడా శ్రియా తన గ్లామరస్ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక గతంలో ఆమె మాల్దీవ్స్‌లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంది. అక్కడ సముద్రం తీరంలో సాగర కన్యలా శ్రియా తన అందాల ఆరబోత చేసింది. ఫేస్‌బుక్‌లో కొద్ది గంటల క్రితమే ఈ ముద్దుగుమ్మ తన మాల్దీవ్స్ ట్రిప్స్ గురించి ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో తన పిచ్చేక్కించే అందం చూసిన వారంతా శ్రియా పెళ్లి అయ్యి ఒక బిడకు జన్మనిచ్చిన తరువాత కూడా ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు.

ఈ అమ్మడు కెరీర్‌లో చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించింది. ఆమె మంచి డ్యాన్సర్ కూడా. ఒకప్పుడు కుర్రాళ్ల గుండెల్లో కలల రాణిగా నిలిచింది. ఇటీవలే శ్రీయ ‘గమనం’ అనే సినిమా లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఇండస్ట్రీ లో శ్రియా కేరిర్ కొనసాగుతూనే ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.