దిల్ రాజుకు భారీ బొక్క‌… ‘ వార‌సుడు ‘ టాలీవుడ్ బిజినెస్ ఇంత‌ దారుణ‌మా..!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి డైర‌క్ష‌న్‌లో న‌టిస్తున్న సినిమా వార‌సుడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ద్విభాషా సినిమాగా తెర‌కెక్కిస్తున్న‌రు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయింద‌ని టాక్‌.. ఈ సినిమా కోలీవుడ్ లో వంద కోట్ల కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది అని సమాచారం.

Thalapathy 66 Film #Vaarasudu Xclusive Posters | Vamshi Paidipally |  Rashmika , Vijay | #Varisu 🔥 - YouTube

ఇదే సమయంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా దాదాపు రు. 50 కోట్ల కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది అన్ని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే టాలీవుడ్ లో విజ‌య్‌కు అంత మార్కెట్ లేదని.. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఆయన సినిమా కనిసం 10 కోట్ల కలెక్షన్ కూడా రాబట్ట లేకపోయిందని.. ఇప్పుడు వచ్చే వారసుడు సినిమాకు ఏకంగా 50 కోట్ల బిజినెస్ చేయ‌టం ఏంటి అంటూ చాలా మంది షాక్ అవుతున్నారు.

TFPC goes against Dil Raju-produced 'Varasudu' - Telugu News -  IndiaGlitz.com

అసలు రీజన్ ఏమిటంటే ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు.. ఈ సినిమాను సంక్రాంతికి స్వయంగా రిలీజ్ చేయడంతో సినిమాకు జరుగుతున్న బిజినెస్ లెక్కలలో నిజం లేదని దొంగ లెక్కలు చూపిస్తున్నారు అన్న‌ టాక్ కూడా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా అవడంతో టాలీవుడ్ లో వారసుడు పై మంచి బజ్‌ క్రియేట్ అయింది.

Title Locked For Vijay And Vamshi Paidipally Film | Thalapathy66:  విజయ్-వంశీ పైడిపల్లి సినిమా టైటిల్ ఇదేనా?

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు అభిమానులకు కోరుకున్న స్థాయిలో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమాను సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలకు పోటీగా విడుదల చేయబోతున్నారు. అయితే వారసుడు సినిమా ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.