ఆస్కార్ షార్ట్ లిస్టులో RRR నాటు నాటు..!

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్. ఆర్.ఆర్.. ఈ సినిమా ను ఆస్కార్ అవార్డుల నామినేషన్ కోసం రాజమౌళి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోతున్న ఆస్కార్ అవార్డు వేడుకలకు సంబంధించిన సన్నహాలు కూడా మొదలవుతున్నాయి. ఈ సమయంలోనే ఆస్కార్ అవార్డుల యొక్క నామినేషన్స్ ప్రకటించడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని విభాగాలకు సంబంధించి షార్ట్ లిస్టును కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అకాడమీ వారు విడుదల చేసిన షార్ట్ లిస్టులో రాజమౌళి ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు చోటు దక్కించుకుంది.

అకాడమీ వారు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 2023 ఆస్కార్ అవార్డు నామినేషన్ షార్ట్ లిస్టులో కచ్చితంగా ఏదో ఒకటి లేదా రెండు విభాగాల్లో అయినా ఆర్ఆర్ఆర్ ఉంటుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా బల్లగుద్ది మరి చెబుతున్నాయి.. ఈ క్రమంలోని తాజాగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో షార్ట్ లిస్టులో మన నాటు నాటు పాట చోటు దక్కించుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. కీరవాణి సంగీతం అందించిన ఈ పాట కోసం ఇద్దరు హీరోలు ఏ స్థాయిలో పోటీపడి మరి డాన్స్ చేశారో మనం చూశాం. బెస్ట్ కొరియోగ్రఫీకి కూడా ఈ పాటకు అవార్డు రావాలంటే అభిమానులు కోరుకుంటున్నారు.

ఆస్కార్ అవార్డుల యొక్క షార్ట్ లిస్టులో ఈ పాట చోటు సంపాదించుకున్న నేపథ్యంలో ముందు మరింత సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని.. ఆస్కార్ నామినేషన్ లో మన తెలుగు సినిమా పలు విభాగాలలో స్థానం దక్కించుకునే అవకాశం ఉందని కూడా అంతా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పాటతో రామ్ చరణ్, ఎన్టీఆర్ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.