అమ్మ బాబోయ్..బాలయ్య ఇంత రొమాంటిక్ హీరో నా..శృతి పై హాట్ కామెంట్స్ వైరల్..!!

న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న మనసులో ఏమీ దాచుకోరు…తాను ఏది అనుకుంటే అది బ‌య‌ట‌కు చెప్పేస్తూ ఉంటారు అలా కొన్నిసార్లు ఆ కామెంట్లపై ఎన్ని విమర్శలు వచ్చినా బాలయ్య వాటిని పట్టించుకోరు.
బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఆహ‌లో అన్ స్టాపబుల్ షోకి వ్యాఖ్యాత‌గా చేస్తున్నారు. అ షో ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ టాక్ షోగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు జ‌రుగుతున్న రెండో సీజ‌న్ కూడా ఎవ‌రు ఉహించ‌ని రీతిలో దూసుకుపోతుంది.

Unstoppable 2: ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య డ్యాన్స్.. ట్రిపుల్ ధమాకాగా ఎపిసోడ్ | Unstoppable 2: Jayasudha Jayaprada Rashi Khanna With Balakrishna - Telugu Filmibeat

ఇప్ప‌టికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లిట్ చేసుకున్న ఈ సీజ‌న్లో ఇప్ప‌డు ఆరో ఎపిసోడ్ రాబోతుంది. అ షోకి టాలీవుడ్ ఎవ‌ర్ గ్రీన్ హీరోయిన్లు జ‌య‌ప్ర‌ధ‌, జ‌య‌సుధ మ‌రియు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశిఖన్నా వ‌చ్చారు. దానికి సంబంధించిన తాజా ప్రోమో నిన్న రాత్రి విడుద‌ల చెయ్యగా.. అందులో బాల‌య్య అదిరిపోయే రేంజ్ లో వారిని ఆడుకున‌డు. ఆ ప్రోమోలో బాలకృష్ణ నేను శృతిహాసన్ ఏపీకే హాట్ పెయిర్ అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.

అన్ స్టాపబుల్ షోలో భాగంగా బాలయ్య ఈ కామెంట్లు చేయడం గమనార్హం.ఈ ప్రోమోలో జై బాలయ్య సాంగ్ కు రాశిఖన్నాతో పాటు జయసుధ, జయప్రద డ్యాన్స్ చేయడం అంద‌రిని అక‌ట్టుకుంది. బాలయ్య రాశిఖన్నాతో చిలిపిగా అంద‌రిన్ని ఊరికే నవ్వుతూ పడేస్తావ్.. పడేస్తావ్ అంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లకు రాశిఖన్నా మురిసిపోయింది. మీ మాట్ల‌ల‌కు నేను పడిపోయా అని చెబుతూ బాలయ్య- రాశిఖన్నాను తెగ నవ్వించాడు.

Unstoppable 2: బాలయ్య తో అందాల భామలు

ఆ తర్వాత రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాలోని ఏం సందేహం లేదు పాటను అద్భుతంగా పాడి మెప్పించింది. త‌ర్వాత నాలుగు టకీలా షాట్ లు వేసేద్దామా అంటూ బాలయ్య అడగగా రాశిఖన్నా ఓకే చెప్పి బాలయ్య చెప్పిన గేమ్ ఆడింది. అప్పుడు బాలయ్య నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసిందంటూ కామెంట్లు చేశారు. ఆ తర్వాత బాలయ్య వారితో నేను శృతి హాసన్ ఇప్పుడు హాట్ పెయిర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్ప‌గా. త‌ర్వాత వారిని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కుడా అడిగారు.

Unstoppable With NBK S2: జయప్రద, జయసుధ,రాశీ ఖన్నాలతో బాలయ్య అన్‌స్టాపబుల్ 6 ఎపిసోడ్.. ప్రోమో విడుదల.. | Unstoppable With NBK S2 Evergreen beauties jayaprada Jayasudha in balakrishna ...

వాటిలో ప్ర‌ధ‌నంగా.. హీరోయిన్ అవ్వాలంటే కొన్ని విషయాలలో రాజీ పడక తప్పదని ఇది నిజమా అబద్ధమా అని బాలయ్య ముగ్గురు హీరోయిన్లను అడిగారు.ఉమెన్ సెంట్రిక్ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు 100 సార్లు ఆలోచిస్తారు నిజమా? అబద్ధమా? అని బాలయ్య ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలకు ముగురు హీరోయిన్లు చెప్పిన సమాధానాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగాల్సిందే. ఇప్పుడు ప్రోమోకు సోష‌ల్ మిడియ‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ తో దూసుకుపోతుంది.