యాంకర్ ప్రదీప్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా..?

ఇండస్ట్రీలో బ్యాచులర్స్.. సినిమా ఇండస్ట్రీలోనే కాదు టీవీ ఇండస్ట్రీలో కూడా చాలామంది వివాహం చేసుకోకుండా ఇంకా బ్యాచులర్స్ గానే ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. ఈయన యాంకరింగ్ అంటే చాలామందికి ఇష్టం. ఫీమేల్ యాంకర్స్ లో సుమకు ఎంత క్రేజ్ ఉందో మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు కొన్ని సంవత్సరాల పైనే అవుతున్నా ఇప్పటికీ తన స్టైల్ మార్చకుండా అదే స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నాడు.

సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్న ప్రదీప్ ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో గత ఏడాది నటించి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ గురించి కథ కొన్ని రోజులుగా పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రదీప్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆయన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్లీ డిసెంబర్ 26వ తేదీన ప్రదీప్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తల వైరల్ అవుతున్నాయి.

ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ఫ్యాషన్ డిజైనర్ నవ్య. ఈమె పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి డిజైనర్ గా వర్క్ చేస్తుంది. వీళ్ళిద్దరూ చాలా రోజులుగా రిలేషన్షిప్ లో ఉన్నారని.. వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని సమాచారం. అందుకే డిసెంబర్ 26న ఎంగేజ్మెంట్ చేసుకొని ఫిబ్రవరి రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం అయితే ఇద్దరి మతాలు వేరైనాప్పటికీ వాళ్లు సంతోషంగా ఉండాలని పెద్దలు వారి వివాహం చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. అసలు విషయం తెలియాలంటే మరో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే.