టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర హీరోగా కొనసాగుతున్నన బాలయ్య.. కెరియర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సీనియర్ హీరోల క్రేజ్ కు కాలం చెల్లిపోయింది అనడానికి లేదు.. వాళ్ల ఇమేజ్‌కు కరెక్ట్ గా సూటయ్యే సినిమా వస్తే అది ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
అలా బాలకృష్ణతో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేయొచ్చు అని బోయపాటి వంటి పలువురు దర్శకులు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను బాలయ్య లైఫ్ లోకి వచ్చే వరకు అయన కెరియర్ డౌన్ ఫాల్లోనే ఉందన్నది వాస్తవం. బాలయ్య ఇమేజ్ కరెక్ట్ గా వాడుకుని అయనకు సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్‌లు ఇచ్చాడు బోయపాటి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే అది సూపర్ హిట్ అని.. జనాలు ఎగబడి చూస్తారు.. అందులో డౌటే లేదు.
కానీ మొన్నటీవరకు బోయపాటి లేకపోతే బాలయ్య లేడు అన్నట్లు కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ కామెంట్లకు కూడా కాలం చెల్లిపోయింది. బాలయ్య.. ఇప్పుడు తన ఒకప్పటి ఫామ్ లో దూసుకుపోతున్నారు అంటే అందుకు మూఖ్య కారణం అల్లు అరవింద్ అని నెటిజెన్ల అభిప్రాయం. ఈ మెగా నిర్మాత మెగా హీరోలను పక్కన పెట్టి.. నందమూరి బాలకృష్ణతో ఈ మధ్య కాలంలో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నాడు. అంతేకాదు బాలయ్య సినిమాల విషయంలో కూడా ఈ మెగా ప్రొడ్యుసర్ ఇన్వాల్వ్ అవుతున్నారనేది బలంగా వినిపిస్తున్న టాక్.
ఒకప్పుడు చిరు – చరణ్ సినిమాలను అల్లు అరవింద్ ఫైనల్ చేసేవారు. ఇప్పుడు ఆమెగా హీరోలు అందరిని పక్కడ పెట్టి.. తన సపోర్ట్ మొత్తం బాలయ్యకే ఇస్తున్నారని తెలుస్తుంది. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో బాలయ్య సంపాదించుకుంది అంటూ ఏమీ లేదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినా తన పారితోషికం మత్రం రూ.8 కోట్ల వద్దే ఉండేది. నిర్మాతలకు అందుబాటులో ఉండాలి అనే తన తండ్రి మాటకు కట్టుబడి ఆయన వ్యవహరించేవారు. ఎప్పుడు కమర్షియల్ యాడ్స్ జోలికి కూడా పోయేవారు కాదు.
ఇప్పుడు మత్రం ఆయన తన పంధా మారింది. బాలకృష్ణ కూడా ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించారు. ఇంకా ఇప్పుడు మరి కొన్ని యాడ్స్ లో నటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తన పారితోషికాన్ని కూడా పెంచి.. లాభాల్లో వాటాలు కూడా అడుగుతున్నారు బాలయ్య అని టాలీవుడ్ వర్గలో టాక్. ఆయన ఇలా మారడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ సోషల్ మీడయాలో మత్రం ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ఇదే..!