గత కొన్ని రోజుల నుంచి హ్యాకర్స్ సామాన్య ప్రజల్ని మాత్రమే కాదు సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికే హ్యాకర్స్ బారినపడి మరింత ఇబ్బందుల ఫాలో అవుతున్నారు. ఒకవేళ హ్యాకర్స్ విషయంలో ముందే జాగ్రత్త పడకపోతే మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లభించదు. ప్రస్తుతం ఇలాంటి ఊబిలోకి చిక్కుకుంది హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ. విష్ణు ప్రియ ఫేస్ బుక్ అకౌంట్ తాజాగా హ్యాక్ అయింది. ఎవరో పని కట్టుకొని చేసిన పనికి ఈమె ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది . ఈ అమ్మడి హ్యాకింగ్ ఖాతాలో హాట్ ఫోటోలు , శృంగార వీడియోలు అసభ్యకరమైన భంగిమలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి.
అంతేకాదు రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో కూడిన వీడియోలకు యువత బాగా అట్రాక్ట్ అవుతోంది. ఒక్కసారిగా ఈమె ఫాలోవర్ సంఖ్య భారీగా పెరిగిపోయింది . ఈ విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్న విష్ణు ప్రియ వెంటనే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసింది . అకౌంట్ బ్లాక్ చేయాలని అన్ ఫాలో చేయండి అని అభిమానులకు పిలుపునిచ్చింది. అంతేకాదు తన అజాగ్రత్త వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ కూడా క్షమాపణలు తెలియజేసింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ అమ్ముడు పై దాడి మాత్రం ఆగలేదు. హ్యాకరులు అదేపనిగా అటాక్ చేస్తూ విష్ణుప్రియ అకౌంట్ తో సహా అన్ని ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అడల్ట్ కంటెంట్ ను జోరుగా వదులుతున్నారు.
విష్ణు ప్రియ మాత్రం తనను అన్ ఫాలో చేయండి అని వేడుకుంటుంటే ..ఆమెనే రివర్స్‌లో తప్పుపడుతున్నారు.. కావాలని ఈ డ్రామాకు తెర తీసి ఇప్పుడు ఆపేయమంటే ఎలా.. అంటూ కొంతమంది నిందిస్తున్నారు. మొత్తానికి విష్ణు ప్రియ అజాగ్రత్త ఇంతటి ఉపద్రవానికి దారితీసింది. తప్పు చేయకుండానే నింద మోయాల్సి వచ్చింది. అయితే విష్ణుప్రియ హాట్ వీడియోలు కొన్ని హ్యాకింగ్ కంటే ముందు అధికారిక ఖాతా ద్వారా వైరల్ అయ్యాయి. మొత్తానికి అయితే విష్ణు ప్రియ ప్రమేయం లేకుండానే ఇలాంటి తప్పిదం ఎదురైందని చెప్పవచ్చు. ఇక కొంతమంది హ్యాకర్ల వల్ల విష్ణు ప్రియ పూర్తిగా ఇబ్బంది పడుతోంది అని చెప్పవచ్చు.
View this post on Instagram