టాలీవుడ్ ఆగ్రనిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు గా, స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడుగా..గౌరవం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు శిరీష్ మొదటి సినిమాతో అనుకున్నా అంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన స్టార్ డమ్‌ను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నూతన దర్శకుడు రాకేశ్ శశి తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అల్లు శిరీష్ కు జంటగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ఈ జంట లిప్ లాక్ హగ్గలతో నింపేశారు. ఈ సినిమా కథ యూత్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు మలిచిన తీరు ఎంతో బాగుంది.
ఈ సినిమా స్టోరీ ప్రస్తుతం జరుగుతున్న ప్రేమికులు పెళ్లి కన్నా లివింగ్ రిలేషన్ షిప్ లకు మొగ్గు చూపుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి స్టోరీ ఈ ఊర్వశివో రాక్షసివో సినిమా. ఈ సినిమాలో హీరో పెళ్లి ముఖ్యమనుకునే అబ్బాయిగా… ఇక హీరోయిన్ పెళ్లి కన్నా లివింగ్ రిలేషన్ షిప్ బెటర్ అనుకునే అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య జరిగిన స్టోరీ ఈ సినిమా. కథలో ఎటువంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు తీసిన విధానం బావుందని టాక్ నడుస్తోంది.
ఇక లిప్ లాక్ లు, హగ్ లు సైతం అనవసరంగా నొప్పించకుండా సీన్లు ఉండడంతో ప్రేక్షకులు మంచి ఫీల్ అవుతూ సినిమా ఎంజయ్ చేస్తున్నారు. ఏదిఏమైనా అల్లువారిబ్బాయికి లిప్ లాక్ లు బాగా కలిసి వచ్చి మంచి హిట్ నే అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.