తెలుగు చలన పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక ఇలా అనేక జానర్ లలో చిత్రాలను తెరకెక్కించి.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ స్థాపించాలని ఆలోచన చేసి.. కేవలం 9 నెలలు గడువులోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సేవలను ఎంతో మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీఆర్ తన హయాంలో ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా రాజకీయంగా ఆయనను వెన్నుపోటు పొడిచింది నారా చంద్రబాబు నాయుడు అంటూ చాలా కథనాలు వెలువడ్డాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది ఆ ఆరుగురు మహిళలే అంటూ హాట్ బాంబు పేల్చారు..
ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..” మన గ్రామం సహజ ఉత్పత్తుల కేంద్రం” సందర్శన సమయంలో వెంకయ్య కాళ్లకు మహిళల నమస్కరించడంతో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వెంకయ్య నాయుడు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఇంట్లో కూర్చున్న సమయంలో మహిళలు ఆయన కాళ్లకు నమస్కరించారు.. ఎందుకు నమస్కరించారని నేను ఎన్టీఆర్ ను అడగగా .. నాపై వారికున్న ప్రేమ , అభిమానం అని ఎన్టీఆర్ బదులిచ్చారు.. నేను ఏమాత్రం భయపడకుండా అభిమానమా.. పిండాకూడా అంతా ఏమి లేదు .. వట్టిదే అంటూ చెప్పాను.. కానీ ఆయన నమ్మలేదు.
తర్వాత జరిగిన పరిణామాలలో రాజకీయపరంగా ఎన్టీఆర్ పతనం జరిగినప్పుడు ఆ ఆరుగురు మహిళలే ముందు ఉండడం నన్ను కలచివేసింది . కానీ ఆరుగురు మహిళల పేర్లు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు అంటూ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మొత్తానికైతే వెంకయ్య నాయుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఎన్టీఆర్ రాజకీయ పతనానికి చంద్రబాబు కారణం కాదు అని పరోక్షంగా తెలుస్తోంది.