స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. పుష్పాది రైజ్ మొదటి భాగంతోనే పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ఇంటర్నేషనల్ క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో వచ్చే అల్లు అర్జున్ మేనరిజం డైలాగులు ఇమిటేట్ చేస్తూ ఈ సినిమాకి అదనపు ఇమేజ్ తీసుకొచ్చారు.
ఇక ఇప్పుడు అందరు చూపు పుష్పాది రూల్ సెకండ్ పార్ట్ మీద ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టు పార్ట్ 2 ని ఎవరు ఊహించని విధంగా భారీ స్థాయిలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ చిత్ర యూనిట్ ముగించింది. పుష్ప పార్ట్ 2 ప్రమోషన్ల విషయంలో కూడా సుకుమార్ క్రియేటివిటీ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లబోతున్నాడు. అసలు విషయం ఏమిటంటే పుష్ప 2కు సంబంధించినన టీజర్ ని మేకర్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ టీజర్ ను వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ సినిమాగా విడుదలవబోతున్న అవతార్ సినిమా విడుదలయ్యే రోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి ప్రధాన కారణం అవతార్ సినిమా చాలా దేశాల్లో విడుదలబోతుంది. ఈ సినిమాకు భాషతో సంబంధం లేకుండా అన్ని దేశాలలో ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అవతార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాతో పాటు పుష్పా2 టీజర్ ని విడుదల చేయడంతో సినిమాకు అదనపు ప్రమోషన్ వస్తుందని సుకుమార్ భావిస్తున్నారట.
పుష్పాది రూల్ సినిమాని వచ్చే సంవత్సరం దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ టీజర్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అవతార్ 2 కి వచ్చే ఇంటర్వెల్ బ్రేక్‌లో పుష్పా2 టీజర్ ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాతో మరిన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేయబోతున్నాడు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.