ప్రియాంకా కాపురంలో నిప్పులు పోసిన స్టార్ బ్యూటి.. “వాడు నా వాడే” అంటూ బిగ్ బాంబ్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ..సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బడా బడా సినిమాలు చేసి హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా .. తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ను ప్రేమించి ..కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది . రీసెంట్ గానే సరోగసి ప్రాసెస్ ద్వారా ఓ పాపకు జన్మనిచ్చి తల్లి కూడా అయింది .ఈ క్రమంలోని ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ లపై ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ అమెరికన్ యాక్ట్రెస్ ఒలివియా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే నిక్ జోనస్ .. ప్రియాంక చోప్రా తో డేటింగ్ చేసే కన్నా ముందు అమెరికన్ యాక్ట్రెస్ ఒలీవియాతో డేటింగ్ చేశాడు. వీళ్లిద్దరి జంట అప్పట్లో సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా చేతిలో చేతులు వేసుకుంటూ హద్దుల మీరి ప్రవర్తించిన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేసేయ్. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రియాంక చోప్రా పరిచయమైన తర్వాత ..నిక్, ఒలివియాతో డేటింగ్ బ్రేకప్ చెప్పేసాడు .అంతేకాదు ఆమెతో బ్రేకప్ చెప్పిన కొన్ని నెలలకి ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు . ఈ క్రమంలోనే కొన్నాళ్లు డిప్రెషన్ కి లోనై ఆమె.. ఆ తర్వాత జీవితం ఇక్కడితో ఆగిపోకూడదని మళ్లీ తన లైఫ్ ని కంటిన్యూ చేసింది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె నిక్ జోనస్ పై సంచలన కామెంట్స్ చేసింది . వాడు నా వాడే అంటూ బిగ్ బాంబు పేల్చింది. “నాకు నిక్ జోనస్ అంటే చాలా ఇష్టం ..అతని క్యారెక్టర్ నన్ను చాలా ఇన్ ఫ్లూయెన్స్ చేసింది . అతనిపై ఇష్టంతో లాస్ ఏంజల్స్ కి కూడా మారాను . అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు నా పేరుకి బ్రాండ్ లేదు. కానీ ప్రేమలో మాత్రం ఉండిపోయాను. హ్యాపీగా ఉన్నాను అంతా బాగుంది కదా అనుకుంటున్న టైంలో మా లైఫ్ లోకి ప్రియాంక చోప్రా ఎంటర్ అయింది . నిజానికి నేను అతని పెళ్లి చేసుకోవాలనుకున్న ..అతడు నా వాడే అనుకున్నాను.. సర్వం ధారపోసాను కానీ అతడు నా ప్రేమను కాదని వేరొకరితో జీవితాన్ని పంచుకున్నాడు .ఆ బాధను భరించలేకపోయాను .దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో పడిపోయాను .కానీ లైఫ్ అంటే ఇక్కడ ఆగిపోకూడదు. ఇంకా ముందుకు వెళ్లాలి అంటూ నన్ను నేను ధైర్యం చెప్పుకొని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను .ఇప్పటికి నాకు నిజంగా ఆయన అంటే చాలా చాలా ఇష్టం” అంటూ సంచలన కామెంట్స్ చేసింది . దీంతో పచ్చని కాపురంలో నిక్ జోనస్, ప్రియాంకల మధ్య చిచ్చు పెట్టిన్నట్లైంది ఒలీవియా.

Share post:

Latest