విడాకులకు సిద్ధమైన సానియా మీర్జా.. అసలు విషయం ఇదే..!!

ప్రపంచ స్టార్ మహిళా టెన్నిస్ క్రీడాకకారిణి లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు సానియా మీర్జా. డబుల్స్ లో ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచారు. ఇప్పటికే ఆమె ఖాతాలో ఆరు డబుల్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ 100కి చేరుకున్న ఏకైక భారతీయురాలు కావడం గమనార్హం. 2007లో సానియా 27వ ర్యాంకుకి కూడా చేరుకుంది. భారత సంతతికి చెందిన స్టార్ టెన్నిస్ అయినా సానియా పాకిస్తాన్ కి కోడలు అయింది. ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. వీరి పెళ్లి సమయంలో కూడా సానియా అనేకమంది విమర్శలను కూడా ఎదుర్కొంది. అలాగే పలువురు రాజకీయ నేతలు కూడా ఆమె పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

एक्टर संजय दत्त और शाहरुख खान के बाद अब भारतीय महिला टेनिस स्टार सानिया मिर्जा को मिला दुबई का गोल्डन वीजा... | संजय दत्त के बाद सानिया ...

అయితే ప్రేమకు హద్దులు, ఎల్లలు ఉండవని నిరూపిస్తూ అతడిని వివాహం చేసుకుంది. అలా 2010 లో సానియా షోయబ్ మాలిక్ ల వివాహం జరిగింది.. ఇక వివాహం అనంతరం వరల్డ్ బెస్ట్ స్టార్ కపుల్ గా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. 12 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరు తమ జీవితంలో ఇప్పుడు ఏదో వెలితి కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమధ్య కాలంలో సానియా మీర్జా చేసిన పోస్ట్లు నెట్ లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి ..దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా 2018లో వీరిద్దరికీ ఇజహాన్ అనే ఒక మగ బిడ్డ పుట్టాడు..

क्या सानिया मिर्जा-शोएब मलिक में सबकुछ ठीक नहीं? सोशल मीडिया पर शादी टूटने की अटकलें तेज
అయితే ప్రస్తుతం త్వరలో సానియా , షోయబ్ విడిపోతున్నారని ఇంటర్నెట్లో ఊహాగానాలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారని అలాగే కొడుకు ఇజహాన్ కి మాత్రమే తల్లిదండ్రులుగా ఉన్నారు అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక ఖచ్చితమైన కారణం తెలియదు కానీ ప్రస్తుతం ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. సోయబ్ తన టీవీ షోలలో ఒక దానిలో సానియా ను మోసం చేశాడని పాకిస్తాన్ నుండి కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై వీరు ఇంకా స్పందించలేదు. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో తెలియాల్సి వుంది.

 

View this post on Instagram

 

A post shared by Sania Mirza (@mirzasaniar)

Share post:

Latest