కార్తీకదీపం వంటలక్క ఆస్తి గురించి తెలుసా? స్టూడియోలు, లగ్జరీ కార్లు?

తెలుగునాట కార్తీకదీపం వంటలక్క ఇమేజ్, మన తెలుగు హీరోలకి ఏమాత్రం తీసిపోదు. అమాయకత్వంతో ఆమె డాక్టర్ బాబు కోసం చేసిన పోరాటం.. పిల్లలకోసం పడే తపన కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్ ను అమాంతం ఆకాశానికెత్తేసింది. దాంతో సగటు తెలుగు మహిళలు వంటలక్కని తమ సోదరిగానే భావించడం కొసమెరుపు. అయితే చాలామందికి వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమివిశ్వనాథ్ బ్యాక్ గ్రౌండ్ గురించి అస్సలు తెలియదు. ఆమె ఆస్తుపాస్తుల విలువ తెలిస్తే బిత్తరబోతారు!

అవును, ఆమె గురించి తెలుసుకోవాలని చాలా మంది గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెతుకుతున్నారని సర్వే. ఆ మాదిరిగా వంటలక్క ఫేమస్ అయ్యిందంటే దానికి ఆమె నటనే కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆమె బాక్గ్రౌండ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటలక్క లా చదివి ప్రాక్టీస్ కూడా చేస్తుందట. ప్రేమివిశ్వనాథ్ కు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఆ స్టూడియోలలో మలయాళ ఇండస్ట్రీకి సబంధించిన సినిమాలు, సీరియళ్ల షూటింగ్స్ జరుగుతాయని భోగట్టా.

ఆమెకు కోట్లలో ఆస్తులు ఉన్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆమెకు దాదాపు 40 నుండి 50 కోట్ల మేర ఆస్తులు ఉండవచ్చని అంచనా. ఇక్కడ కార్తీక దీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ప్రేమీ విశ్వనాథ్ అక్కడ ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా చేసిన సంగతి తెలిసినదే. పెద్ద ఫ్యామిలీ కలిగి ఉన్న ప్రేమీవిశ్వనాథ్ భర్త ఒక ఫ్రొఫిషినల్ ఆస్ట్రాలజర్ అట. ఆమె భర్త పేరు డాక్టర్ వినీత్ భట్ . ఆయన 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా అవార్డ్ తీసుకోవడం గమనార్హం.

Share post:

Latest