సంచ‌ల‌నం.. విడాకుల దిశగా శ్రీ‌కాంత్‌.. ఊహ‌తో తెగ‌దెంపుల‌కు సిద్ధం?

శ్రీకాంత్-ఊహ.. టాలీవుడ్ లో వీరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వీరిద్దరూ జంటగా తొలిసారి `ఆమె` సినిమాలో నటించారు. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమ‌కు అంగీకారం తెలపడంతో.. శ్రీకాంత్-ఊహ తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు రోషన్ మేధా రోహన్ అనే ముగ్గురు పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత శ్రీకాంత్ కెరీర్ ను కొనసాగించాడు. కానీ ఊహ మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీని చూసుకోవడంలో బిజీ అయింది. గత పాతికేళ్ల నుంచి ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఎందరో దంపతులకు ఆదర్శంగా నిలిచిన శ్రీకాంత్-ఊహలకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సంచ‌ల‌న వార్త వైరల్ గా మారింది.

అదేంటంటే.. శ్రీకాంత్ విడాకుల దిశగా వెళ్తున్నాడట. ఊహతో తెగ‌దెంపుల‌కు చేసేందుకు సిద్ధం అవుతున్నాడ‌ని ప్రచారం జరుగుతుంది. ఆర్థికపరంగా వీరిద్దరి మధ్య ఎప్ప‌టి నుంచో గొడవలు జ‌రుగుతున్నాయని, బయటకు సంతోషంగా ఉన్నట్లు కనిపించినా లోలోపల వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ ఊహకు విడాకులు ఇవ్వాల‌ని డిసైడ్ అన్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచార ఎంత వరకు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.