ఎన్టీఆర్ కొడుకు కి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు కు సైతం చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సినీ తారల ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక సూపర్ సార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిల విషయంలో మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దగ్గర వరకు మహేష్ అందానికి ఫిదా అవ్వని అభిమానులంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ కూడా మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట.

Telugu Events | Telugu Movie Events | Tollywood Events
ఇక ఇటీవలే ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో వీరిద్దరి నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా మంచి విజయం దిశగా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అయ్యి ఇతర భాషలలో కూడా విడుదలయ్యింది. దాదాపుగా ఈ సినిమా రూ.1200 కోట రూపాయలకు పైగా వసూలు సాధించినట్లుగా రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ పార్టీని జరుపుకోవడం జరిగిందట.

Mahesh Babu is the next chief guest on Jr NTR's Evaru Meelo Koteeswarulu.  See leaked pic - India Today
ఈ పార్టీలో ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా రావడం జరిగింది. అయితే అభయ్ ను తన ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా ఏ మాత్రం ఆలోచించకుండా మహేష్ బాబు అని తెలియజేశారట. మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా అంటే అభయ్ కు చాలా ఇష్టమట. దీంతో ఈ మాటలు విన్న ఎన్టీఆర్ అభిమానులు మహేష్ బాబు అభిమానులు సైతం ఒక్కసారిగా సంబరపడిపోతున్నారు. మహేష్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా అయినా రావాలని కోరుకుంటున్నారు.

Share post:

Latest