బిగ్ బ్రేకింగ్: కమల్‌హాస‌న్‌కు తీవ్ర‌ అస్వస్ధత.. ప‌రిస్థితి క్రిటిక‌ల్‌…!

సౌత్ ఇండియా స్టార్ హీరో లోకనాయకుడు కమలహాసన్ ఈరోజు ఉదయం తీవ్ర‌ అస్వస్థత‌కు గురయ్యారు. ఆయనకు జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కమల్ హాసన్ కు అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కమల్ హాసన్ ఇంతకు ముందు రెండుసార్లు కరోనా భారిన పడ్డారు.

Kamal Haasan confirms that Indian 2 'will happen' | Filmfare.com

అప్పుడు కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో వైద్యం తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి విక్రమ్ సినిమా తీసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కూడా వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ టైం లో ఆయన హాస్పటల్‌లో జాయిన్ అవ్వటం.. ప‌రిస్థితి క్రిటిక‌ల్ అన‌డంతో కొంత ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.

Share post:

Latest