టాలీవుడ్‌కు నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో పరిచయం అయ్యింది త్రిష. తన మొదటి సినిమాతోనే తన మోడ్రన్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రలైనా సరే తన కళ్ళతో హావ భావాలను పలికించి హీరోయిన్గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడీగా వర్షం సినిమాలో నటించింది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఒక్కసారిగా తన వైపు చూసేలా చేసుకుంది. ఈ సినిమాతో త్రిష ఒక్కసారిగా ఆగ్ర హీరోయిన్గా మారిపోయింది.
ఆ సినిమా తరవాత నుంచి స్టార్ హీరోల సైతం త్రిష డేట్స్ కోసం ఎదురుచూసే అంతగా తన స్టార్ డమ్‌ను పెంచుకుంది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న టైం లోనే కొన్ని అనుకోని కారణాలవల్ల కొంతకాలం చిత్ర పరిశ్రమకు దూరమైంది త్రిష. రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి.. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో సాలిడ్ హిట్ నూ తనా ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా తర్వాత నుంచి త్రిష కు వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్‌లో దళపతి విజయ్ తో ఓ సినిమాలో నటించబోతుంది. అలాగే తెలుగులో కూడా ఓ రెండు సినిమాలను కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. అయితే త్రిష కోలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమాలో తన కెరియర్ లోనే ఎప్పుడు చేయని వ్యభిచారి పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష ఇలాంటి రోల్ చేస్తుందని అంటే కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
దీనికి ప్రధాన కారణం త్రిష తన ఇష్టమైన హీరో కోసమే ఈ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్. అయనతో నటిస్తున సినిమాలోనే త్రిష వ్యభిచారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమాలో ఆ పాత్రను బాలీవుడ్లో అలియా భట్ నటించిన గంగుబాయ్ కత్తియవాడి పాత్రకు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. ఏదేమైనా కమల్కోసం త్రిష రిస్కీ పాత్రలో నటిస్తుందని ఆమె ఫ్యాన్స్ వాపోతున్నారు.