తన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన నటుడు ఉపేంద్ర..!!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నిన్నటి రోజున అస్వస్థకు గురయ్యారు అనే విషయం చాలా వైరల్ గా మారింది. షూటింగ్ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తగా వెంటనే దగ్గరలో ఉండే బెంగళూరులోని నేల మంగలలోని హర్ష ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. అయితే ఉపేంద్ర ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. అయితే కేవలం డస్ట్ అలర్జీ కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడ వైద్యులు తెలియజేయడం జరిగింది.

Upendra Admit Hospital: ದಿಡೀರ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾದ ನಟ ಉಪೇಂದ್ರ, ಉಪೇಂದ್ರ  ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಏರುಪೇರು. - NADUNUDI

అలా ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే ఉపేంద్ర సినిమా షూటింగ్ సెట్లో పాల్గొన్నారు. ఉపేంద్ర అనంతరం తన ఆరోగ్యం పై అభిమానులు ఆందోళన చెందడంతో తన ఫేస్బుక్ నుంచి ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని షూటింగ్స్ పార్ట్ లోనే ఉన్నట్లుగా తెలియజేస్తూ అభిమానులు ఆందోళన చెందవద్దని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉపేంద్ర వరుసగా నాలుగు , ఐదు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తున్న కబ్జా చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీయ శరణ్ నటిస్తూ ఉన్నది. ఈ చిత్రాన్ని ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా భారీ అంచనాలను పెంచేసాయి. ఉపేంద్ర నటిస్తున్న మరొక చిత్రం ఏమిటంటే..UI అనే ఒక టైటిల్ తో మరొక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పలు పోస్టర్లు కూడా గతంలో విడుదలయ్యాయి. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి మరి యూఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఉపేంద్ర షేర్ చేసిన ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

<iframe src=”https://www.facebook.com/plugins/video.php?height=476&href=https%3A%2F%2Fwww.facebook.com%2Fnimmauppi%2Fvideos%2F1316724789089476%2F&show_text=false&width=267&t=0″ width=”267″ height=”476″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowfullscreen=”true” allow=”autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share” allowFullScreen=”true”></iframe>

Share post:

Latest