చిరంజీవి-నాగబాబు వల్ల తమ్ముడు రాజకీయ కెరియర్ పై దెబ్బ పడనుందా..!!

నిన్నటి రోజున చిరంజీవి ఉద్దేశించి గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక వీటికి తగ్గట్టుగానే మెగా బ్రదర్ నాగబాబు కూడా గరికపాటిని కాస్త విడ్డూరంగా మాట్లాడడంతో ఈ విషయం కాస్త మరింత పాపులర్ అయింది. దీంతో అటు మెగా అభిమానులు సైతం గరికపాటిక పైన విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా ఈ విషయంతో అటు పవన్ కళ్యాణ్ రాజకీయ కెరియర్ పైన దెబ్బ పడేవిధంగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

Mega Brothers: Swinging on new creatures .. Theater owners' expectations  for a month .. | Are Mega Brothers the cause of film trouble in Andhra  Pradesh? Interesting analytical - filmyzoo - Hindisip
గరికపాటి చిరంజీవికి సిగ్గుతో క్షమాపణలు చెబుతున్నానంటు ఈరోజు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై నాగబాబు తనతో క్షమాపణలు చెప్పించుకోవాలన్న కోరిక తమకు లేదని తెలియజేశారు. ఈ విషయాన్ని మెగా అభిమానులను అర్థం చేసుకోవాలి కానీ ఆయనపై ఎవరు తప్పుగా మాట్లాడొద్దు అని కూడా రిక్వెస్ట్ చేశారు. ఇక అంతే కాకుండా రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవాని కుమార్ శుక్రవారం రోజున గరికపాటితో మొబైల్ లో మాట్లాడారు చిరంజీవి పట్ల మీరు వ్యవహరించిన తీరు తమకు బాధ కలిగించిందని అభిమానులు ఆగ్రహం కలిగిన వారిని శాంతింప చేశానని చెప్పారట.

ప్రస్తుతం రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉన్న ఆయన చుట్టూ మాత్రం రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాగబాబు వేసిన కౌంటర్ పై బ్రాహ్మణ సంఘాలు కూడా రంగంలోకి దిగాయి సినిమాల పేరుతో వ్యాపారం చేసుకునే వారికి ప్రవచనాలు చెప్పే పండితులకు పోలిక ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదాన్ని మరింత బలంగా చేశాయి వాస్తవానికి అలయ్ బలయ్ ఏదో సున్నితమైన అంశం కాబట్టి అక్కడ అందరితో కలిసిపోవడం చిరంజీవి లాంటి వ్యక్తి చేయాలి కానీ కేవలం అభిమానులతో ఎక్కువగా తన సమయాన్ని గడపడం చేతనే ఈ సమస్య వచ్చిందని పలువురు బ్రాహ్మణ సంఘాలు తెలియజేస్తున్నాయి. దీంతో ఇటు నాగబాబు చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ పైన దెబ్బ పడే అవకాశం ఉందని బ్రాహ్మణ సంఘాలు తెలుపుతున్నాయి.

https://twitter.com/NagaBabuOffl/status/1578368222402748416?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1578368222402748416%7Ctwgr%5E56c87c020673e90a5f51ba4b439574cda7e418a2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-3602988510881104014.ampproject.net%2F2209142312000%2Fframe.html