అలనాటి అందగాడు శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?

అలనాటి అందగాడు శోభన్ బాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్న మొన్నటి తరానికి బాగా తెలుసు. ఆరడుగుల అందానికి నిలువెత్తు రూపం అతడు. నటనకి సరికొత్త నిర్వచనం శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిలంతా తాము పెళ్లిచేసుకోబోయేవాడు శోభన్ బాబులాగ ఉండాలని కలలు కనేవారట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో NTR, ANR మరియు కృష్ణ తరువాత శోభన్ బాబుగారిదే హవా. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ని ఇతను బాగా ఆకట్టుకున్నాడు. ఈరోజు ఆయన చనిపోయి 15 ఏళ్ళు దాటుతున్నా కూడా నేటి తరం ప్రేక్షకులు అతనిని స్మరించుకుంటున్నారు.

అందానికి నిలువెత్తు రూపంలాగా ఉండేవాడు కాబట్టే శోభన్ బాబు గారిని అప్పట్లో సోగ్గాడు అని పిలుచుకునే వారు. ఇకపోతే శోభన్ బాబు స్టార్ స్టేటస్ తో కొనసాగుతూ ఉండగానే వయసు మీద పడుతుండడంతో ప్రేక్షకులు తనని ఎప్పుడూ సోగ్గాడిగానే చూడాలని అక్కడినుండి సినిమాలు చెయ్యడమే మానేసాడట. శోభన్ బాబు గారు సినిమాలు ఆపేసిన.. ఆయన కుమారుడు తన లెగసీని కొనసాగిస్తాడని అప్పట్లో ఆయన అభిమానులు అనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి.

విషయం ఏమంటే, శోభన్ బాబు గారు తన కొడుకుని సినిమాల్లోకి పంపించేందుకు ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. ఎందుకంటే ఓ సినీ నటుడిగా శోభన్ బాబు గారు ఎదురుకొన్న ఒత్తిడి తన కొడుకు ఎదుర్కొనకూడదని అతను భావించారట. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. అదృష్టం బాగుంటే ఒకలాగా ఉంటుంది. లేదంటే మరోలా ఉంటుంది. అందుకే అతని కొడుకు విషయంలో అలాంటి రిస్క్ తీసుకోవడం అతనికి నచ్చేది కాదట. ఈ విషయంలో ఎంతోమంది సలహాలు, సూచనలు ఇచ్చినా వారి మాటలు శోభన్ బాబు వినేవాడు కాదట!