రామ్ చరణ్ ని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ.. హిట్ కొడతాడో లేదో..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా తన కెరియర్ లోనే ఎవరూ ఊహించని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు ముందు భారీ బజ్ ని విజ‌య్‌ నమోదు చేసుకోగలిగాడు..ఆ సినిమా ప్లాప్ తర్వాత తన తర్వాతి సినిమాల పట్ల మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. అయితే ఇప్పుడు విజయ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును ఓకే చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Charan Blockbuster Vs Vijay 3 Hits | cinejosh.com

జెర్సీ సినిమాతో డైరెక్టర్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి.. తన తర్వాతి సినిమాని రామ్ చరణ్ తో భారీ ప్రాజెక్టు ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనుకోని కారణాలు వల్ల ఈ సినిమా నుంచి రామ్ చరణ్ తప్పుకున్నాడు.. అయితే ఇప్పుడు అదే స్టోరీ తో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడట. ఈ వార్తలో ఎంతవరకు నిజమో కానీ ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వార్తపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన తన 15వ సినిమా షూటింగ్లో బిజీగాా ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్‌లో కొంత గ్యాప్ దొరకడం వలన వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో అయినా విజయ్ దేవరకొండ హిట్ కొడతాడో లేదో చూడాలి.