భార్య కళ్లముందే నిత్యా మీనన్ తో ఎన్టీఆర్… షాక్ లో ప్రణతి!

Jr NTR అంటే తెలియని తెలుగు ప్రజలు వుండరు. నందమూరి వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఎదిగిన స్టార్ హీరో ఇతడు. తారక్ అభిమానులైతే అతని సినిమాలంటే గుడ్డలు చించుకుంటారు. ఈ మధ్యనే RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి మేకోవర్ అవుతున్నాడు. ఇకపోతే NTR అమ్మాయిలకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడు.

అయితే ఒక్క నటి విషయంలో మాత్రం NTR కాస్త చనువు ప్రదర్శిస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అది మీరు ఊహించనిది. ఎందుకంటే వారి కాంబినేషన్లో ఒకే ఒక్క సినిమా వచ్చింది. అదికూడా వారు కలిసి కనబడేది కొన్ని నిముషాలే. అయినా వారిద్దరూ బాగా క్లోజ్ అయ్యారట. ఆమె పేరే నిత్యా మీనన్. అవును, వీరు కలిసి ‘జనతా గ్యారేజ్’ అనే సినిమాలో నటించారు. ఇకపోతే NTR ఎంత మంది హీరోయిన్లతో నటించినప్పటికి ఏ హీరోయిన్ కి చెప్పని ఓ మాట కేవలం నిత్యామీనన్ కి మాత్రమే చెప్పారట.

ఇక ఆ మాట విన్నపుడు NTR భార్య లక్ష్మీప్రణతి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారట. నిత్యా మీనన్ నటనకు ఫిదా అయిన NTR ఆమెను ప్రశంసించకుండా వుండలేకపోయాడట. ఆమె నటనకు ఓ రేంజ్ లో మార్కులు వేశారట. ఇకపోతే ఆ సినిమాలో మరో హీరోయిన్ సమంత కూడా నటించింది. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నిత్యమీనన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్ నిత్యమీనన్ గురించి మాట్లాడుతూ.. అసలు నేను నిత్య మీనన్ తో కలిసి నటిస్తానని అనుకోలేదు.. అంతేకాదు ఇప్పటి వరకు అలాంటి నటిని నేను చూడలేదు అంటూ కితాబిచ్చాడు.