బాలయ్యను వీడలేకపోతున్న జయమ్మ.. కారణమేంటో తెలిస్తే షాక్..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ షో తో బాలయ్య ఒక్కసారిగా థింకింగ్ మారిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలకృష్ణ కు కోపం ఎక్కువని ఆవేశపరుడమే ఇండస్ట్రీలో టాక్ బాగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈ షో వల్ల బాలయ్య కు పబ్లిక్ లో మరింత పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఈ షో వల్ల బాలకృష్ణ కోపం, బాధ ప్రేమ, ఆనందం ఇలాంటి వాటిని వెంటనే చూపిస్తూ ఉన్నారు.

Balakrishna vs Varalakshmi Sarath Kumar బాలయ్య తో ఢీ కొట్టబోయే లేడీ విలన్
ఇక ఇండస్ట్రీలో బాలకృష్ణ అని అర్థం చేసుకొని బాంటింగ్ ఏర్పరచుకున్న వాళ్ళు బాలయ్యని అంత సులువుగా వదిలిపెట్టలేరని చెప్పవచ్చు. అలాంటి వారిలో విలక్షణమైన నటి, హీరోయిన్గా పేరుపొందింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని ఆమె బాగా ఆస్వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న NBK -107 సినిమాల వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో వరలక్ష్మి నటించబోతున్నట్లు సమాచారం.

మొదటిసారి బాలయ్యతో కలిసి పని చేస్తున్న వరలక్ష్మి బాలకృష్ణతో ఉన్న సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తోందట. అంతేకాకుండా బాలయ్యతో స్క్రీన్ లో పాత్రకు తగ్గట్టుగా అన్న అని పిలిచిన..ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఒక కూతురిగా బాలకృష్ణతో మెలుగుతోందట వరలక్ష్మి శరత్ కుమార్. ఇక బాలకృష్ణ కూడా ఒక కూతురిలా ట్రీట్ చేస్తున్నారని ఇన్సైడ్ ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక సెట్ లో అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడమే కాకుండా.. వరలక్ష్మి, బాలకృష్ణ మధ్య అనుబంధం బాగా ఏర్పడిందంట. దీంతో ఈ అన్నా చెల్లెలు ఇద్దరు బాగా కలిసిపోయినట్లు సమాచారం.