డబ్బు కోసం తెలుగు హీరో ఛండాలం..సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం..!?

డబ్బు మనిషిని ఎలాంటి పనులైనా చేయిస్తుంది . ఎంత స్థాయికి అయినా దిగజార్చుతుంది అని పెద్ద వాళ్ళు చెప్తుంటే ఏదో అనుకున్నాం. కానీ ఇలాంటి వార్తలు విన్నాక అది నిజమే అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే అది అందరికీ తెలిసిందే . కానీ డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తారా అని అంటే అవునని అనాలి ఈ హీరో చేసే పనులు చూస్తుంటే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కష్ట పడి పైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ..ఆ తక్కువ లో ఇతడు ఒక్కడు. కష్టపడి పైకి ఎదిగి పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రజెంట్ ఒక్కటంటే ఒక్క సినిమా హిట్ కొట్టలేక అల్లాడిపోతున్నాడు.

అంతేకాదు తన ప్రీవియస్ ట్రాక్ రికార్డు చూసిన దర్శక నిర్మాతలు అతను కచ్చితంగా హిట్ కొట్టగలడు అంటూ ప్లాప్ అవుతున్నా కానీ అతనికి మంచి మంచి సినిమా స్టోరీలను అందిస్తున్నారు. కానీ ఈ హీరో తల పొగరుతో రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తూ పరమ చెత్త కథలను చూస్ చేసుకుంటూ.. ఉన్న పరువును కాస్త మరింత దిగజార్చుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈయన నటించిన లాస్ట్ 7 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కానీ ఇప్పటికీ ఈ హీరోకి సినిమా అవకాశాలు వస్తున్నాయి ..దానికి ఏకైక కారణం అతను గతంలో మెదిలిన తీరు ,నడుచుకున్న విధానం , కష్టపడి ఇండస్ట్రీలోకి పైకి వచ్చి సంపాదించుకున్న స్టేటస్.

అయితే రాను రాను డబ్బు ఎక్కువ అవడంతో చెడు స్నేహాలు పెరిగి చెత్త పనులు చేయడం ఎక్కువగా అలవాటు చేసుకున్నాడు . అంతేకాదు ఈ తెలుగు హీరోకి డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందంటూ గతంలో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. నేను తీసుకోవట్లేదు అని చేతులు దులిపేసుకున్నా కానీ అతనిపై ఇంకా ఆ నిందలు అలాగా కొనసాగుతున్నాయి . అయితే రీసెంట్గా తనకు లైఫ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కథ వివరించడానికి ఇంటికి వస్తే గేట్ బయట నుంచి లేనని చెప్పి పంపించేసారట సెక్యూరిటీ వాళ్లతో. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో ఆ హీరో ఆ డైరెక్టర్ ఇంటికి చిరిగిన బట్టలతో వెళ్ళాడని, ఆకలి అంటే అన్నం పెట్టాడని,.. అదే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఇంటికి వస్తే సెక్యూరిటీ వాళ్లతో బయట నుండి బయటకే పంపించేసారని ..పరిస్థితి అంతా తలకిందులైందని.. హిట్ కొట్టకపోయిన ఈ హీరోకి తలపగురు మాత్రం తగ్గలేదని సదురు డైరెక్టర్ ఫ్రెండ్స్ తో చెప్పుకొని బాధ పడ్డారట. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ వార్త ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఇప్పటికే ఈ హీరో ఎవరో మీకుఅర్థం అయిపోయింది కదా.. ఆ హీరో ఎవరనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి..!!