వైరల్ గా మారుతున్న జూనియర్ ఎన్టీఆర్ షూ ధర.. ఎంతంటే..?

నందమూరి అభిమానులతో పాటు ఈ జనరేషన్ ను బాగా ఆకట్టుకుంటున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరిని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు విదేశాలలో కూడా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎలాంటి చిన్న విషయం బయటకు వచ్చిన కూడ అది చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా RRR సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ క్యాపిటల్ టోక్యోలో ఉన్నారు.

Jr NTR, Ram Charan, Upasana, Pranathi laugh and walk at Japan's Shibuya  Crossing - Hindustan Times

అక్కడ ల్యాండ్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో మీట్ అవ్వడమే కాకుండా ఫోటో ,ఆటోగ్రాఫర్ వంటివి ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి వీడియోస్.. తన భార్య లక్ష్మీ ప్రణీత తో తీసుకున్న ఫోటోలు ఇలా ప్రతి ఒక్క మూమెంట్ కూడా సోషల్ మీడియాలో అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ గురించి ఒకసారి న్యూస్ స్ప్రెడ్ అవుతోంది ఆ న్యూస్ ఏమిటంటే ఎన్టీఆర్ వేసుకున్న షూస్ కాస్ట్ ఎంతనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతొంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో కనిపించిన షూ కాస్ట్ , మాస్క్ రేటు గురించి కూడా కొన్ని న్యూస్ వైరల్గా మారాయి ఇప్పుడు RRR ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ఎయిర్ జోర్దాన్ బ్రాండ్ కు సంబంధించిన హై పారిస్ సెయింట్ జర్మన్ షూస్ వేసుకోవడం జరిగింది. ఈ బ్రాండ్ ప్రైజ్ అని నెట్టింట్లో సెర్చ్ చేయగా అక్షరాల దీని ధర రూ.34,999 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. ఎన్టీఆర్ కు సంబంధించి స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.