RRR సినిమాను మించి RC -15 రికార్డ్..!!

RRR సినిమాతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలు పైన మరింత దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం తాము నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం Rc -15 సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తున్నది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కించడంతో ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా యూఎస్ లో అన్ని ఇండియన్ భాషల్లో విడుదల చేయడానికి మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.

RC 15': Ram Charan-Shankar's movie titled 'Sarkarodu'? | Deccan Herald
ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ ఇప్పటికే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమా యొక్క యూఎస్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ పంపిణీ సంస్థకు అమ్మేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్న ప్రకారం RC -15 సినిమాను యూఎస్ లో పంపిణీ చేసేందుకు దాదాపుగా రూ.17.2 కోట్ల రూపాయలు సదరు ఆ సంస్థతో దిల్ రాజు ఇచ్చేందుకు ఒప్పందం కుదురుచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

RRR సినిమా కూడా రామ్ చరణ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఈ స్థాయిలో యూఎస్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాంచరణ్ నాన్ RRR రికార్డును సైతం నమోదు చేసుకున్నారంట మెగా అభిమానులలో పలు చర్చలు జరుగుతున్నాయి. RC -15 సినిమాతో కలెక్షన్ల విషయంలో కూడా నాన్ ఆర్ఆర్ ఆర్ సినిమా రికార్డును చరణ్ దక్కించుకోవాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి మరి.